దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కరోనా వైరస్ నుండి అన్ని వ్యాధులకు వైద్యం చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ చివరకి అతను డాక్టర్ కోర్స్ చదువులేదన్నా సంచలన విషయం బయటపడింది. దీంతో అంత ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఓ వ్యక్తి పదో తరగతి చదివేసి పెద్ద డాక్టర్ మాదిరిగా వైద్యం చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న వ్యక్తిని గుర్తించారు. పదో తరగతి చదువుతో కోవిడ్‌తో సహా అన్ని వ్యాధులకు చికిత్స చేస్తున్న ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి నిర్వాహకుడి మోసాన్ని డీఎం అండ్ ‌హెచ్‌వో వెలుగులోకి తీసుకొచ్చింది. నరసాపురం బ్రాహ్మణ సమాఖ్య భవనం రోడ్డులో ఉన్న గాబ్రేల్‌ ఆసుపత్రిలో నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై డీఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ సునంద తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ స్థానంలో ఉన్న ఆసుపత్రి నిర్వాహకుడు సతీష్‌‌ను సర్టిఫికెట్‌లు, అనుమతులు చూపాలని డాక్టర్ సునంద కోరారు. దీంతో తనకు పీఎంపీ, ఆర్‌ఎంపీ సర్టిఫికెట్‌ కూడా లేదని, కేవలం పదో తరగతి వరకు చదివానని సతీష్‌ చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్ కి గురైంది. వెంటనే ఆస్పత్రిని సీజ్‌ చేసి అక్కడ ఉన్న హైపవర్‌ యాంటీ బయోటిక్‌ మందులను స్వాధీనం చేసుకున్నారు.

అయితే డాక్టర్‌ ని అంటూ ప్రజలకు వైద్యం చేస్తున్న సతీష్‌ పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులను డాక్టర్ సునంద ఆదేశించారు. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కొందరు నకిలీ పీఎంపీ, ఆర్‌ఎంపీలు తమ వైద్యశాలలు మూసేసి పరారైనట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: