ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాజీమంత్రి టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్న నాయుడు మరింతగా యాక్టివ్ అయ్యారు. తన మార్క్ రాజకీయం ఏంటో చూపించుకునేందుకు, మరింతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునేందుకు , ఆయన ప్రయత్నిస్తున్నారు. తనకు అందివచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని తెలుగుదేశం పార్టీలో తన మార్క్ చూపించాలనే ఉద్దేశంతో స్పీడ్ పెంచినట్టు గా కనిపిస్తున్నారు. అయితే ముందుగా తన సొంత నియోజకవర్గం టెక్కలి నియోజకవర్గం నుంచే రాజకీయం మొదలు పెట్టినట్టు గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ సమస్యలు ఎదురవుతున్నాయి. 


ఎక్కడా కనీసం ప్రోటోకాల్ పాటించకుండా,  వైసిపి నియోజకవర్గ ఇన్చార్జి లతో, ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్న వంటి వ్యవహారాలాపై ఏపీ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. అయితే దీనిని ఇప్పుడు అచ్చెన్న రాజకీయానికి ఉపయోగించుకుంటున్నట్టు గా కనిపిస్తున్నాడు. ఇక్కడి శ్రీకాకుళం జిల్లా లో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ప్రోటోకాల్ సమస్యలు ఎదురవడం , ఆయన దీనిపై కదలిక లేకపోవడం తో సైలెంట్ అయిపోయారు.ఇదే పరిస్థితి టెక్కలి నియోజకవర్గం లో తనకు సైతం ఎదురవడంతో ఈ వ్యవహారం పై అధికారులను నిలదీశారు. 


ఇటీవల టెక్కలి నియోజకవర్గం లో నిర్వహించిన రైతు భరోసా, సచివాలయాల శంకుస్థాపన ప్రారంభోత్సవాలు కు ఎమ్మెల్యేగా ఉన్న తనను పిలవ లేదని అసెంబ్లీ కార్యదర్శి కి ఫిర్యాదు చేయడం, ఆయన దీనిపై విచారణ చేయించాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేయడం,  కలెక్టర్ దీనిపై నియోజకవర్గంలోని నాలుగు మండలాల ఎంపీడీవో లను వివరణ ఇవ్వాలంటూ కోరడం వంటివి చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారంపై మరింత తీవ్రంగా పోరాడాలని, టిడిపి ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఈ రకమైన పరిస్థితే ఉండడంతో అక్కడ కూడా ఈ వ్యవహారాల పై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ వ్యవహారాలపై అధికారులు గగ్గోలు పెడుతున్నారు. కరవమంటే కప్పకు కోపం , విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా తమ పరిస్థితి తయారైంది అని వారు వాపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: