తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడు గానే రాజకీయం చేసుకుంటూ వెళ్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి ఆయన మరింత స్పీడ్ తో ముందుకు వెళ్తున్నారు. దుబ్బాక మాదిరిగా గ్రేటర్ ఎన్నికల్లోనూ బిజెపి సత్తా చాటాలని , తద్వారా తన సామర్థ్యాన్ని అధిష్టానం పెద్దల వద్ద నిరూపించుకోవాలనే లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రేటర్ లో మెజారిటీ డివిజన్లను బీజేపీ ఖాతాలో వేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. అలాగే పెద్ద ఎత్తున నాయకులను బిజెపిలకి ఆహ్వానిస్తూ,  వారికి కాషాయ జెండా కప్పుతూ,  తనవంతు విజయంలో భాగ స్వామ్యం అవుతున్నారు. ఇదిలా ఉంటే ఆయన ట్రాఫిక్ చాలన్ల వ్యవహారంలో చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో వైరల్ అవ్వడం , ఫైన్ లు వేసినా తాము కడతాము అన్నట్లుగా బండి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. 




అయితే దీనిపై నష్టనివారణ చర్యలకు దిగిన ఆయన,  యువత ఎక్కువగా బిజెపి వైపు ఉన్నందున , టిఆర్ఎస్ ప్రభుత్వం వారికి నిబంధనల ఉల్లంఘన పేరుతో చలాన్ లు రాస్తోందని బండి కవర్ చేసుకునే ప్రయత్నం చేసినా, అది వర్కవుట్ అవ్వలేదు. స్వయంగా నిబంధనలు ఉల్లంఘించాలని బండి ప్రోత్సహిస్తున్నట్లు గా జాతీయస్థాయిలో వైరల్ అవడం వంటి కారణాలతో పాటు,  భాగ్యలక్ష్మి ఆలయం లోకి బండి వెళ్లడం ఖచ్చితంగా మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు అన్న అభిప్రాయాలు జనాల్లోకి వెళ్ళినట్లుగా అధిష్టానం గుర్తించిందని,  అందుకే బండిని కంట్రోల్లో పెట్టిందనే వార్తలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. 


అంతేకాకుండా గ్రేటర్ ప్రచార బాధ్యతలు మొత్తం కిషన్ రెడ్డి కి అప్పగించినట్లు గాను మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో నిజం ఎంత అనే విషయంపై అధిష్టానం పెద్దలు ఎవరు స్పందించక పోయినప్పటికీ , బండిని మాత్రం కంట్రోల్ చేస్తున్నారనే వార్తలు మాత్రం నిజమే అన్నట్లుగా బిజెపి లోనే ఒక వర్గం ప్రచారం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: