భారీ మెజారిటీ తో అధికారంలోకి వచ్చాకా జగన్,  పరిపాలన అంటే ఇదే అన్నట్లు సుపరిపాలన చేసి చూపిస్తున్నాడు.. అన్ని సంక్షేమ పథకాల్లో  ఎలాంటి అక్రమాలు లేకుండా జగన్ ముందుకు సాగిపోతుండగా  టీడీపీ కి ఈ ఎన్నికల్లో 23 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే.. ప్రజల తీర్పుకు ఎవరైనా సమాధానం చెప్పాల్సిందే.. గతేడాది 23 ఎమ్మెల్యేలను లాగేసుకున్న చంద్రబాబు కు అదే సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడం కొస మెరుపు అయితే జగన్ టీడీపీ ని తలదన్నేటట్లు పరిపాలన చేయడం ఇంకో హైలైట్ అని చెప్పొచ్చు..ప్రతిపక్షాల జోరును నిలువరిస్తూ టీడీపీ లాంటి అధికారంలో ఉన్న పార్టీ ను, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ని కాదని ప్రజలు జగన్ ను నమ్మి గెలిపించారు.. ఇక వైసీపీ నేతలు సైతం ప్రజల నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా వనడుచుకుంటూ వస్తున్నారు..  

అయితే ఇదంతా జగన్ ఒక్కడే చూసుకోవడం వల్ల ఆయనపై విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతుందని తెలుస్తుంది. ఈ ఒత్తిడి వల్ల సరైన పాలనా అందించలేకపోతున్నారు. ఇప్పటికే జగన్ పై కొంత వ్యతిరేకత మొదలైంది. దీన్ని తగ్గించాలంటే జగన్ పాలనా మీదే దృష్టి పెట్టాలి.. ఈ నేపథ్యంలో పార్టీ లోని వివాదాలను పరిష్కారించాలంటే ఓ కొత్త నేత అవసరం ఎంతైనా ఉంది.. ఒకేసారి పార్టీ బాధ్యతలను, పరిపాలనను చేసుకోలేకపోతున్నారు జగన్. ఈ రెండు పడవల మీద ప్రయాణం వల్ల పాలనాపరమైన కష్టాలు వెంటాడుతున్నాయి. పార్టీ లో కూడా చాల సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. దీన్ని అధిగమించాలంటే పార్టీ బాధ్యతలు వేరొకరికి అప్పగించాలని జగన్ డిసైడ్ అయ్యారట.

వైసీపీలో జగన్ తప్ప మరో నేతను ఎవరూ ఊహించలేరు. అయితే అన్నీ ఆయనే అంటే అది అసలు కుదిరే పని కాదు. జగన్ ప్రభుత్వ పాలనే చూసుకుంటారా? పార్టీ పంచాయతీలే తీరుస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. అందువల్ల జగన్ పార్టీ బాధ్యతలను వదిలేసి తనకు నమ్మకమైన వారికి అప్పగించాలన్నఆలోచన ఆయనకు వచ్చిందట. అపుడే కరెక్ట్ గా పార్టీ కంట్రోల్ లోకి వస్తుందని కూడా అంటున్నారు. అయితే జగన్ రేంజ్ లో పార్టీ ని నడపగల వ్యతి ఎవరనేది చూస్తే అది ఒక్క షర్మిల అని అనిపిస్తుంది. జగనన్న వదిలిన బాణాన్ని అని ఎనిమిదేళ్ళ క్రితం దూసుకువచ్చిన షర్మిల గత ఎన్నికల వేళ వూరూ వాడా తిరిగి బై బై బాబూ అంటూ ప్రచారం చేశారు అది చాలా పవర్ ఫుల్ గా సాగి జగన్ విజయాన్ని రెట్టింపు చేసింది. షర్మిలలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. పైగా ఆమెకు కూడా పార్టీ నేతలందరితో పరిచయాలు ఉన్నాయి. చూడబోతే లోకల్ బాడీ ఎన్నికలు దగ్గర అవుతున్నాయి ఈ కీలకమైన సమయంలో ఆమెను తీసుకువచ్చి పార్టీ పగ్గాలు అప్పగిస్తే మళ్ళీ మునుపటిలా పరుగులు తీస్తుందని అంటున్నారు.మరి జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: