తెలంగాణాలో ఎన్నికల హడావుడి జోరుగా ఉందని చెప్పొచ్చు.. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో భాగ్య నగరంలో అన్ని పార్టీ లు ప్రచారాల హోరు కొనసాగిస్తోంది.. అధికార పార్టీ టీ ఆర్ ఎస్ కి ఈ గెలుపు ముఖ్యం కాగా కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తుండి.. ఇక బీజేపీ దుబ్బాక లో విజయంతో కొత్త ఉత్సాహం తో బరిలోకి దిగుతుంది.. తెలంగాణ రాష్ట్రంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న కేసీఆర్ కి దుబ్బాక ఉప ఎన్నిక బ్రేక్ వేసింది.. ఇక్కడ బీజేపీ అనూహ్యంగా విజయం సాధించి టీ ఆర్ ఎస్ కి పెద్ద షాక్ ఇచ్చింది.

అయితే టీ ఆర్ ఎస్ కూడా గ్రేటర్ ఎన్నికలను త్వరగా నిర్వహించి పెద్ద షాక్ ఇచ్చిదని. దుబ్బాక లో ఓడిపోయిన బాధలో ఉన్న టీ ఆర్ ఎస్ వెంటనే ఈ నిర్ణయం తీసుకోవడం పట్లబీజేపీ కొంత షాక్ ఇచ్చేదే అయినా వెనువెంటనే అభ్యర్థులను రెడీ చేసుకుని బరిలోకి దిగింది. వరదల వల్ల ప్రభుత్వం పై కొంత వ్యతిరేకత అయితే ఉంది.. పైగా ఉప ఎన్నికల్లో ఓడిపోయిన పరాభవం టీ ఆర్ ఎస్ కి ఉంది.. ఇవన్నీ బీజేపీ కి ప్లస్ అయ్యి మరింత దూసుకు పోయే విధంగా ప్లాన్ చేసుకుంది.

ఇక ఇక్కడ గెలిచి నిలవాలంటే మైనార్టీ ల సపోర్ట్ తప్పని సరి.. కేసీఆర్ ఇందువల్లే రాష్ట్రంలో ఇన్ని రోజులుగా అధికారంలో ఉన్నాడని అందరికి తెలుసు.. మరి బీజేపీ వీరిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేస్తుందా అనేది అర్థం కావట్లేదు. పాతబస్తీలో దాదాపు 33 డివిజన్లలో గ‌త ఎన్నిక‌ల్లో రెండు స్థానాల్లో బీజేపీ గెలిచింది. కొన్ని డివిజ‌న్ల‌లో గ‌ట్టి పోటీ ఇచ్చింది. పాతబస్తీలోని కొన్ని డివిజన్లలో గతంలో పోటీ చేసిన అభ్యర్థులనే తిరిగి టికెట్‌ ఇచ్చారు. పురానాపూల్‌, ఉప్పుగూడలో గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు మరో సారి అవకాశం ఇచ్చారు.  గతంలో తక్కువ ఓట్లతో ఓడిపోయిన వారు గట్టి ప్రయత్నం చేస్తే పాతబస్తీలో సీట్ల సంఖ్య పెంచుకోవచ్చునని పార్టీ నేతలు భావిస్తున్నారు. డబీర్‌పురా, జంగ్మెట్‌ డివిజన్లలో పట్టు సాధిస్తామనే దీమాతో నాయకులున్నారు. మరీ ఏదైనా కొత్త వరం ప్రకటిస్తే కానీ  ఇక్కడ బీజేపీ గెలిచే సీన్ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: