ఏపీలో తిరుపతి ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతుంది. ఎన్నికల కమిషన్ ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించడానికి అన్ని సిద్ధం చేస్తుంది. ముహూర్తం పెట్టడమే ఉంది.. అయితే అప్పుడే ఎన్నికలు దగ్గరికొచ్చేసినట్లు ఇక్కడి ప్రతిపక్షాల ప్రవర్తన చూస్తే తెలుస్తుంది. టీడీపీ అయితే ఎక్కడ తమ ఉనికి కోల్పోతుందో అని వైసీపీ ఓడించాడనికి బీజేపీ తో చేతులు కలపడానికి సైతం సిద్ధంగా ఉంది.. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోడీ కి, టీడీపీ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు చేసిన పోరాటానికి మోడీ దిగి రావాల్సి వచ్చింది. అయితే ఆ పోరాటం వల్ల  చంద్రబాబు పై కొంత సింపతీ కూడా వచ్చింది..

ఇదిలా ఉంటే తెలంగాణాలో నూ  బీజేపీ పార్టీ కీలకమైన గ్రేటర్ ఎన్నికలకు సిద్ధమవుతుంది.దుబ్బాక ఉప ఎన్నిక లో విజయం సాధించి టీ ఆర్ ఎస్ కి పెద్ద షాక్ ఇచ్చింది.. ముందు నుంచి ఇక్కడ గులాబీ పార్టీ దే విజయం అనుకున్నారు అంతా కానీ ఎప్పుడైతే రఘు నందన్ రెడ్డి ఎంటర్ అయ్యాడో అప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. మూడో సారి కూడా అదే నేత నిలబడడంతో ఆయనకు సింపతీ కూడా వర్క్ అవుట్ అయ్యింది. రెండు సార్లు ఓడించిన ప్రజలు ఈ సరి ఆయనకు అవకాశం ఇచ్చారు..

ఇక గ్రేటర్ ఎన్నికల లో బీజేపీ సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తుంది. ఛార్మినార్‌ వద్దనున్న భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్ళడం, అప్పుడెప్పుడో పక్కన పెట్టేసిన రోహింగ్యాల వ్యవహారాన్ని కదపడం, అధికార టీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి మీరు ముస్లింల గురించి మాట్లాడినప్పుడు మేం హిందువల గురించి మాట్లాడితే తప్పా అంటూ మీడియా ముందుకు రావడం గమనిస్తే తమకు అత్యంత అలవాటైన, సులభమైనదని భావిస్తున్న హిందూత్వ అజెండానే గ్రేటర్‌ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సంసిద్దమైపోయారన్నది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.టీఆర్‌ఎస్, యంఐయంలకు ప్రత్యామ్నాంగా ఉన్నది తామేనని, ఆ ట్రేడ్‌ మార్కును సొంతం చేసుకోవడానికే బీజేపీ నాయకత్వం ఈ ప్రయత్నమన్నది ఇప్పటికే ఖరారు చేసేసినట్టే. కాంగ్రెస్‌ను తెలంగాణా వాసులు పెద్దగా పట్టించుకోవడం లేదన్నది కూడా స్పష్టమైపోయింది. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ బృందంపై ఉన్న వ్యతిరేక ఓటింగ్, కాంగ్రెస్‌ ఓట్లుకు తోడు బీజేపీ ఓటు బ్యాంకును గంపగుత్తుగా కాపాడుకోవడం ద్వారానే తమ విజయావకాశాలు మెరుగుకాగలవన్నది బీజేపీ నాయకులు అంచనాకొచ్చేసారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: