ఈ కొత్త ఏడాది చాల ప్రశ్నలకు సమాధాన తెలిసేలాకనిపిస్తుంది..జగన్ అధికారంలో ఉన్న ఇప్పటివరకు అనేక కార్యకలాపాలు జరిగాయి. గతంలో ఏ పార్టీ కూడా కనీవినీ ఎరుగని రీతిలో వైసీపీ బంపర్ మెజారిటీ తో గెలిచింది.అప్పటికే ఎంతో ప్రజాభినం ఉన్న టీడీపీ ని కాదని ప్రజలు జగన్ ని గెలిపించారు.. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నపటినుంచి జగన్ ఎంత కష్టపడ్డారో అందరికి తెలిసిందే.. అందుకు తగ్గట్లే అయన పాలన కూడా ఉంది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న జగన్ గురించి ఆయన శైలి, దూకుడు స్వభావం అందరికి అర్థమైపోయి ఉంటాయి..

మూడు రాజధానుల అంశంపై న మొదట్లో తన సన్నిహిత నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చినా ఆయన మాత్రం తొణకకుండా అదే పంథాలో వెళ్లారు ఫలితంగా మూడు రాజధానుల ఏర్పాటు జరుగుతుంది.విశాఖ ని పరిపాలన రాజధాని గా, అమరావతి ని శాసన రాజధాని గా, కర్నూర్ ని న్యాయ రాజధాని గా మలిచిన ఘనత ఆయనకే దక్కుతుంది. సొంత పార్టీ నేతలకు కూడా జగన్ గురించి పూర్తి గా అర్థం చేసుకునే ఉంటారు.. ప్రతిపక్ష నేతలకైతే జగన్ ఎలాంటి స్వభావుడో అర్థమైపోయింది.. తండ్రి వైఎస్సార్ లాగ మెతకమనిషి కాదని తెలిసిపోయింది..ప్రజలకు కన్నా బిడ్డలా జగన్ సేవ చేస్తూనే అవినీతి బకాసురులు పాలిట యముడవుతున్నాడు..   అవతలివాళ్ళు ఒకటిస్తే తను మూడిచ్చే రకం అని అర్థమయిపోయింది..

ఇక అన్నం అంతా చూడనక్కరలేదు. మెతుకు పట్టుకుంటే చాలు. 2021 లో జరిగేది అదే. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎవరికి విజయావకాశాలు ఉన్నాయన్న దాని మీద ఎంతో కొంత స్పష్టత 2021 ఇవ్వబోతోంది. ఓ వైపు స్థానిక ఎన్నికలు ఉన్నాయి. మరో వైపు తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నికలు జరుగుతాయి. ఈ రెండింటా ఢంకా భజాయించే పార్టీలకు ఇక ముందు తిరుగు ఉండదన్న భరోసా అయితే వస్తుంది. మరి 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు గాలివాటం అని ఇప్పటికీ పూర్తిగా నమ్ముతూ తమ్ముళ్ళను నమ్మిస్తున్న తెలుగుదేశం పార్టీకి దాని అధినేత చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో అనుకూలం అవుతుందా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: