హైదరాబాద్ లో వాడి వేడి చర్చలు జోరుగా సాగుతున్నాయి.. దుబ్బాక ఎన్నికల ఫలితాలు తెలంగాణలో మరో చరిత్రను సృష్టించాయి.. ఎప్పుడు ప్రతి ఎన్నికలలో తమ సత్తాను చాటుతున్న అధికార పార్టీ టీఆరెఎస్ ఈ ఎన్నికల్లో మాత్రం ఘోర పరాజయాన్ని చవి చూశాయి.. కాగా, ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలలో తమ సత్తాను చాటేందుకు సమర శంఖాన్ని మోగించింది. అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ప్రభుత్వం గతంలో చేసిన అభివృద్ది పనులను ప్రజలకు తెలియ జేస్తూ వస్తున్నారు. ఇక నిన్న గెలిచిన బీజీపీ కూడా అదే విధంగా మరో విజయాన్ని అందుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు..



ఇది ఇలా ఉండగా నిన్న హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ, తోపులాట జరిగింది. కొంత మంది ఒకర్నొకరు తన్నుకున్నారు.అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..గన్‌ఫౌండ్రికి చెందిన శైలేందర్‌, ఓంప్రకాష్ వర్గీయుల మధ్య ఈ ఘర్షణ నెలకొంది. బీ ఫామ్‌ తీసుకునేందుకు వచ్చిన ఓం ప్రకాష్‌పై.. శైలేందర్‌ యాదవ్ వర్గీయులు దాడికి ప్రయత్నించారు.. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది..కాసేపు ఆఫీసు లో మాత్రం ఉద్రిక్తత చోటు చేసుకుంది..



తెలుగు దేశం పార్టీ నుంచి వచ్చిన ఓం ప్రకాష్ కు పార్టీ టికెట్ ఎలా ఇస్తారు..శైలేందర్ యాదవ్ వర్గీయులు ఆందోళనకు దిగారు. కార్యకర్తలకు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ అన్యాయం చేస్తున్నారని నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ఇరువ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్షణ చోటుచేసుకుంది. ఈ ఘ‌ర్షణ‌లో కార్యకర్తలు పరస్పరం కుర్చీలు కూడా విసురుకున్నారు.మరి కొందరి చొక్కాలు కూడా చించుకున్నారు.. దీంతో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఓం ప్రకాష్‌కి కార్పొరేటర్‌గా టికెట్ ఎలా ఇస్తార‌ని గన్ ఫౌండ్రీ డివిజన్ బీజేపీ ప్రెసిడెంట్ శైలేందర్ యాదవ్ ప్రశ్నించారు.ఎమ్మెల్యే రాజసింగ్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కక్ష కట్టార‌ని  శైలేందర్ మండిపడ్డారు.. ఈ ఘర్షణకు సంబందించిన వీడియో ఒకటి రాజకీయ వర్గాల్లో చర్చలకు దారి తీసింది..



మరింత సమాచారం తెలుసుకోండి: