ఒకప్పుడు పెళ్లి పత్రికలు అంటే ఎంతో సాధారణంగా ఉండేవి. కాని ప్రస్తుతం మాత్రం పెళ్లి పత్రికలు ఎంతో  డిఫరెంట్ గా ఉండడాన్ని  ఎంతో గర్వంగా భావిస్తున్నారు నూతన వధూవరులు. అందుకే ఈ మధ్యకాలంలో అందరికంటే భిన్నంగా పెళ్లి పత్రికలు చేయించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన విషయాలు కూడా క్షణాల్లో అందరిని కళ్ళముందు వాలి పోతున్నాయి. ఏవైనా కొత్త విషయాలు వచ్చాయంటే చాలు క్షణాల   వ్యవధిలో తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. గతంలో ఎంతో మంది భిన్నమైన లగ్నపత్రిక లను తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్ గా మారి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తాయి అన్న విషయం తెలిసిందే.



 కొంతమంది తమ అభిమాన హీరోల పై తమకున్న ప్రేమ అభిమానాన్ని చాటుకుంటూ లగ్న పత్రికలు ముద్రిస్తే మరికొంతమంది మరింత విభిన్నంగా ప్రయత్నించి లగ్న పత్రికలు ముద్రించారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా డిఫరెంట్ గా సోషల్ మీడియా వేదికకు  ఎక్కిన పెళ్లి పత్రికలు కాస్త ఎంతగానో వైరల్ గా మారిపోయాయి. ఇక ఇప్పుడు మరో సరికొత్త పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా శుభలేఖ అంటే రెండు పేజీలు ఉంటుంది.. మరీ ఎక్కువైతే మూడు పేజీలు ఉంటుంది. ఇక్కడ శుభలేఖ చూస్తే మాత్రం అందరూ షాక్ అవుతారు.



 ఎందుకంటే ఇక్కడ ఉన్న శుభలేఖ రెండు లేదా మూడు పేజీలు కాదండోయ్ ఏకంగా  112 పేజీలు ఉంది. ఏంటి ఆశ్చర్య పోయారు కదా.. కానీ ఇది నిజంగానే జరిగింది. కర్ణాటకకు చెందిన రచయిత పంచాక్షరప్ప తన శుభలేఖ 112 పేజీలు ముద్రించాడు. ఇక ఈ శుభలేఖలో తన పద్యాలు కవితలు వివాహబంధాన్ని తెలిపే ఎన్నో వివరాలను కూడా పొందుపరిచి 112 పేజీల శుభలేఖను తయారు చేయించాడు. వివాహాలపై అందరికీ అవగాహన పెంచి మంచి అభిప్రాయాన్ని ఏర్పరిచేందుకు ఇలా ప్రయత్నించినట్లు సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు. పంచరంగి  పేరుతో ఉన్న ఈ శుభలేఖ ప్రత్యేక రంగంలో ప్రస్తుతం ఆకర్షణీయంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: