ఒకే పార్టీలోని వ్యక్తుల మధ్య పెరుగుతున్న వివాదం... దీనికితోడు అసత్య ప్రచారం వీరి మధ్య మరో సమస్యను తీసుకొచ్చింది... తెలంగాణ బిజెపి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించిన అధ్యక్ష పదవి నుండి తొలగించమని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మెసేజ్ చేసాడని  వైరల్ అవుతుంది. నిజంగానే రాజా సింగ్... బండి సంజయ్ ను పదవి నుంచి తొలగించాలని కోరుకుంటున్నారా అని అందరూ ఆశ్చర్య పోతుండగా.... మరో ఆసక్తికర ట్వీట్ దీనిపై క్లారిటీ ఇచ్చింది.

  ఆ వార్త అవాస్తవం అని.... బండి సంజయ్ పదవి గురించి తను ఏ ట్వీట్ చేయలేదని.... రాజా సింగ్ తన అధికారిక ట్విట్టర్ లో తెలియజేశారు. అయితే  బండి సంజయ్ తనని మోసం చేశారన్న మాట వాస్తవం అని పేర్కొన్నారు. అంతేకాకుండా నా నియోజకవర్గం వరకు నేను చెప్పిన వారికే జీహెచ్‌ఎంసీ ఎన్నికలో టికెట్ ఇవ్వాలని అడగడం వాస్తవం అని తెలిపారు. అందులోనూ మిగిలిన 150 డివిజన్ లలో ఎక్కడ అడగను అని కూడా చెప్పాను. కానీ ఇక్కడ నాయకులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తూ తమకు నచ్చింది తాము చేసుకుంటూ పోతున్నారు.

అందుకొరకు నన్ను నమ్మి గెలిపించిన కార్యకర్తకు నేను టికెట్ ఇప్పించుకోలేక పోయినప్పటికీ ... ప్రస్తుతం నా ఫ్యామిలీలో ఒకరు సూసైడ్ చేసుకుంటే ఆ చావులో ఉన్నాను.. 3, 4 రోజుల్లో అన్ని విషయాలతో కేంద్ర పార్టీ కి లేఖ రాస్తాను అని ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యక్త పరిచారు.  నా నియోజకవర్గంలో కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయా అని వ్యాఖ్యానించడం... అందులోనూ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర నాయకత్వానికి లేఖ రాస్తా అనడం సంచలనంగా మారింది . ఈ తరహా వ్యవహారాలు కమలంలో ఇప్పుడు తీవ్ర కలకలానికి దారితీస్తున్నాయి. మరి దీనిపై ఇతర బిజెపి నేతలు ఎలా స్పందించనున్నారో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: