జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల వేదిక‌గా బీజేపీలో వ‌ర్గ రాజ‌కీయాలు తార‌స్థాయికి చేరాయి.. నాయ‌క‌త్వం కోసం ఆ ఇద్ద‌రి నేత‌ల మ‌ధ్య పోటాపోటీ న‌డుస్తోందా..? క‌్యాడ‌ర్ కూడా త‌న్నుకునే దాకా వెళ్తోందా..? అధిష్ఠానం వ‌ద్ద త‌న‌కంటే త‌న‌కే ఎక్కువ బ‌లం ఉంద‌నే వాద‌న ప‌రోక్షంగా స‌న్నిహితుల వ‌ద్ద చెప్పుకుంటున్నారా..? అంటే ఈ ప్ర‌శ్న‌ల‌కు అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో పార్టీ టికెట్ల విష‌యంలో గ‌లాట‌లే ఇందుకు సాక్ష్య‌మ‌ని కొంత‌మంది నేత‌లు పేర్కొంటున్నారు. కోల్డ్‌వార్ తార‌స్థాయికి చేరింద‌ని చెబుతున్నారు.



బీజేపీలో తేల‌ని టికెట్ల గొడ‌వ తేల‌డం లేదు. బీజేపీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి.  హైదరాబాద్‌లోని బీజేపీ హెడ్ ఆఫీసులో గన్‌ఫౌండ్రీకి చెందిన నేతలు కొట్టుకున్నారు. ఓంప్రకాశ్ వర్గీయులు, శైలేంద్ర యాదవ్ వర్గీయులు పరస్పరం తన్నుకున్నారు. చొక్కాలు చించుకొని... అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. కుర్చీలను ధ్వంసం చేశారు. టీవీలు, కిటికీ అద్దాలను పగులగొట్టారు. ఇరువర్గాల ఘర్షణతో బీజేపీ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు.
ఇదిలా ఉండ‌గా బీజేపీలో బండి‌ సంజయ్ వర్సెస్ కిషన్ రెడ్డి అన్నట్టు పరిస్థితి ఉందని హరీష్ రావు ఎద్దేవా చేశారు.


బీజేపీలో టికెట్ల కోసం నాయ‌కులు అంగీలు....లాగులు చింపుకుంటున్నార‌ని అన్నారు. మీలో మీకే స‌మ‌న్వ‌యం లేదు.. ప్ర‌జ‌ల‌కు మీరేం చేస్తారంటూ మంత్రి హ‌రీష్‌రావు అన్నారు.  బీజేపీలో‌ నాయకత్వం కోసం బండి సంజయ్ వర్సెస్  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నట్లుగా అగ్గిరాజుకుందని‌ హరీశ్ రావు అన్నారు. టికెట్ రాలేదని బీజేపీ ఆఫీసులో అంగీలు, లాగులు చింపుకుంటున్నారు. తలలు పగులగొట్టుకుంటున్నారు. బీజేపీ ‌నేతల‌మధ్యే సయోధ్య లేదు. మోదీ ప్రభుత్వం  బెంగళూరు లో వరదలు వస్తే 600 కోట్లు‌ ఇచ్చారని గుజరాత్ లో వరదలు వస్తే 500 కోట్లు‌ ఇచ్చాారని కాని హైదరాబాద్ లో వరదలు వస్తే ఒక్క రూపాయి ఇవ్వలేదని విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: