గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం విషయంలో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ చాలా వరకు కూడా దూకుడుగా వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని కొన్ని క్షేత్రస్థాయిలో ఆ పార్టీని చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతున్నాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రధానంగా రోడ్ల సమస్య పార్టీకి ప్రధాన ఇబ్బందిగా మారింది. అంతే కాకుండా ఇన్ని రోజులు ప్రజల్లో లేని నాయకులు ఇప్పుడు సడన్ గా ప్రజల్లోకి వచ్చేసరికి చాలా వరకు కూడా ప్రజలు తిరస్కరించిన పరిస్థితి ఉంది అనే విషయం చెప్పవచ్చు.

దీనిని భారతీయ జనతా పార్టీ తనకు అనుకూలంగా మార్చుకునే విధంగా ప్రయత్నం చేస్తుంది. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కార్యకర్తలు కూడా ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉంది అనే విషయం చెప్పవచ్చు. దీంతో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా కొన్ని కొన్ని విషయాల్లో ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రచారం కొన్ని ప్రాంతాల్లో ఎలా చేయాలి అనేది కూడా పార్టీ అధిష్టానానికి అర్థం కావడం లేదు. ఈ సంఘటనల మీద సీఎం కేసీఆర్ కూడా కాస్త సీరియస్ గా ఉన్నారు అని తెలుస్తోంది.

అయితే కొన్ని కొన్ని వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు అదే విధంగా ప్రముఖ నేతలు ప్రచారం నిర్వహిస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని సీఎం కేసీఆర్ వ్యక్తం చేసినట్లుగా సమాచారం. త్వరలోనే కొంతమంది ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు ఎక్కడైతే వ్యతిరేకత ఉందో ఆయా ప్రాంతాలకు స్వయంగా వెళ్లి ప్రచారం ముందుకు నడిపించే విధంగా ప్లాన్ చేయాలని ఆయన సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీలో అసంతృప్తి కూడా ఉందని వారితో కూడా మాట్లాడాలని... ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సిఎం కేసీఆర్  ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు. మరి ఈ పరిస్థితులు ఎప్పుడూ సాధారణ స్థితికి వస్తాయి అనేది చూడాలి. బిజెపి కూడా ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి కాస్త ఎక్కువగానే కష్టపడుతుంది అని చెప్పవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: