ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలా ముందుకు వెళ్తారు ఏంటి అనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వద్దు అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసమే ఆసక్తి చూపిస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దీనివలన సీఎం జగన్ కూడా ఇప్పుడు ఎన్నికల సంఘం మీద కాస్త ఆగ్రహం గానే ఉన్నారు.

అయితే ఇప్పుడు సీఎం జగన్ కేంద్రానికి ఎన్నికల సంఘం మీద ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు అని ప్రచారం రెండు రోజుల నుంచి జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే కేంద్ర ప్రభుత్వానికి కొన్ని అంశాలను సీఎం జగన్ వివరించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని అంతేకాకుండా వైద్య సదుపాయాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కాస్త వెనుకబడి ఉందని, కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికల నిర్వహణ అనేది జరిగితే అనవసరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయని, కాబట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉంది అని ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ జరిగితే కరోనా వ్యాప్తి పెరుగుతోందని కాబట్టి ప్రజల్లో కూడా అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయని, కాబట్టి ఎన్నికల సంఘం అర్థం చేసుకుని ముందుకు వెళ్తే మంచిదే అనే భావనను సీఎం జగన్ వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఒక నివేదిక రూపంలో త్వరలో సమర్పించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: