గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రచారం చేయడం ఏమో గాని ఆ పార్టీ చేస్తున్న కొన్ని కొన్ని వ్యాఖ్యలు మాత్రం ప్రజల్లో చులకన అయ్యే విధంగా ఉన్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన రఘునందన్రావు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఎక్కువగా చేస్తున్నారు. హైదరాబాద్ లో ఏది పోతే అది కొని పెడతామని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చాలామందిలో ఆశ్చర్యాన్ని కలిగించాయి.

ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా వివాదాస్పదంగా కూడా మారాయి. అసలు ఎన్నికల మీద ఆయనకు అవగాహన ఉందా లేదా అనేది కూడా ఇప్పుడు చాలామంది ఆశ్చర్యం గా మాట్లాడుతున్నారు. తాజాగా బిజెపి ఎమ్మెల్యేగా ఎన్నికైన రఘునందన్ రావు అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద విమర్శలు చేశారు. ఇప్పుడు వైసిపి ఎన్నికల్లో పోటీ చేయకుండా పరోక్షంగా బిజెపి సహకరిస్తుందని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ తరుణంలో కొన్ని వర్గాల ఓటు బ్యాంకు ని దూరం చేసుకునే విధంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

నిన్న జరిగిన రాజాసింగ్ వ్యవహారం కూడా పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ గొడవ వెనుక ఎవరు ఉన్నారు ఏంటి అనేది తెలియదు కానీ రాజాసింగ్ చేసిన విమర్శలు మాత్రం బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని బాగా ఇబ్బంది పెట్టాయి అనే విషయం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. తనకు అన్యాయం చేసిన మాట వాస్తవం అని ఆయన వ్యాఖ్యలు చేశారు. దీంతో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బిజెపి కొన్ని వ్యాఖ్యలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: