గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు మజ్లీస్ పార్టీ వ్యవహారమే కాస్త ఆసక్తికరంగా మారింది. ఆ పార్టీ ఎలా ఇప్పుడు సత్తా చాటుతుంది అనేది చూడాలి. ఇక ఇప్పుడు మజ్లీస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేసారు. కేటీఆర్ నేను ఏం చేస్తున్నాను ఎక్కడ వెళ్తున్నాను ఆలోచించడం మానేసి నువ్వు ప్రజల గురించి ఆలోచించుకో అని ఆయన సూచించారు. కేటీఆర్ అంటారు మజ్లీస్ కు మాకు ఎలాంటి సంబంధం లేదు అని... కాంగ్రెస్ వాళ్లు అంటారు మజ్లిస్ బీజేపీతో కుమ్మక్కయింది అని... బిజెపి వాళ్ళ అంటారు టిఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఓటేస్తే మజ్లిస్ పార్టీ కు పోతుందని...

అన్ని రాజకీయ పార్టీలు కలిసి నన్ను పెళ్లి కొడుకు చేస్తున్నారు అని ఆయన ఎద్దేవా చేసారు. ఏ పార్టీ ఏం అభివృద్ధి చేశారు ఏం అభివృద్ధి చేయబోతున్నాము అనేది చెప్పట్లేదు అని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ అంటారు నేను మోదీతో కలిసాను లేదో బీజేపీ వాళ్ళు చెప్పాలనేసి... టిఆర్ఎస్ ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలకి విద్యుత్ బిల్లు తగ్గించి ఉంటే చాలా బాగుండేది విద్యుత్ మంత్రికి పేద ప్రజలు కష్టాల గురించి ఆలోచించాలి అని ఆయన సూచించారు. అది వదిలేసి నేను ఎవరితో కలుస్తాను నేను ఏం చేస్తున్నానో అనేసి ఆలోచిస్తున్నారని మండిపడ్డారు.

కేంద్రం మంత్రి ప్రకాష్ జావడేకర్ గారు వచ్చారు నా పైన ఏడుస్తున్నారు మోదీ అభివృద్ధి గురించి ఎన్నికల్లో ప్రస్తావించడం లేదు అని ఆయన విమర్శలు చేసారు. ఎన్నికలు అయ్యేంత వరకూ కేంద్రం నుంచి ప్రతి రోజూ ఎవరో ఒకరు వస్తారు నన్ను తిట్టి పోతుంటారు వీళ్ళు శాంతి భద్రతలను భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఏది ఎలా ఉన్నా సరే మజ్లీస్ మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: