కరోనా వైరస్ అందరి జీవితాలను అతలాకుతలం చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అన్న విషయం తెలిసిందే. అంతా సాఫీగా సాగిపోతున్న జీవితాన్ని ఒక్కసారిగా కుదిపేసింది కరోనా వైరస్. ఎంతో మంది రోడ్డున పడేసిన ఇంకా ఎంతో మందిని కనీసం ఉపాధి లేకుండా చేసి తినడానికి తిండి లేని పరిస్థితి తీసుకు వచ్చింది. అప్పటికే ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఎన్నో కుటుంబాలను నేలకేసి కొట్టినంత పని చేసింది కరోనా వైరస్. దీంతో దిక్కుతోచని స్థితిలో ఎంతో మంది ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు సొంతూరు పయనం అయిన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ పూర్తిగా మనిషి ఆలోచనా తీరులో మార్పు తెచ్చింది.



 కరోనా వైరస్ కారణంగా యువత ఆలోచనా తీరు లో మార్పు వచ్చి  సరికొత్త ఆలోచనలు వైపు అడుగులు వేశారు అనే విషయాన్ని ఇప్పటికే ఎన్నో సర్వేలు చెప్పాయన్న  విషయం తెలిసిందే. ఇటీవలే యంగ్  లైవ్స్  ఇండియా నిర్వహించిన సర్వేలో ఈ ఆసక్తికర విషయం బయటపడింది. కరోనా వైరస్ సంక్షోభం సమయంలో యువత ఆలోచనా తీరు పూర్తిగా మారిపోయిందని... వినూత్న పోకడల వైపు యువత అడుగులు వేస్తోంది అన్నది ఈ సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది ఉద్యోగాల నుంచి తొలగించబడటం.. కంపెనీలు ఉద్యోగుల వేతనాలలో  కోతలు విధించడంతో.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల యువతు ఆలోచనా తీరు లో మాత్రం ఎంతో మార్పు వచ్చింది అన్నది ఈ సర్వే నివేదిక చెబుతోంది.



 ఈ క్రమంలోనే ఉద్యోగం వైపు కాదు స్వయం ఉపాధి వైపు యువత అందరూ అడుగులు వేసే విధంగా కరోనా వైరస్ సంక్షోభం మార్పు తెచ్చింది అన్నది ప్రస్తుతం ఈ సర్వే చెబుతోంది. స్వయం ఉపాధితో పాటు సాగు వైపు ఎంతో మంది యువత సంక్షోభం సమయంలో అడుగులు వేసారు. ఎంతో మంది యువత ప్రస్తుతం సాగు వైపు వెళ్లి సరికొత్త సాంప్రదాయాల తో వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు అన్నది ప్రస్తుతం ఎన్నో సర్వేలు చెబుతున్నాయి. కరోనా వైరస్ రాకముంద 18 సంవత్సరాలు నిండిన యువకుల్లో ప్రతి పదిమందిలో నలుగురు స్వయం ఉపాధి వైపు నడిస్తే ప్రస్తుతం ఆ సంఖ్య ఏడుకు చేరింది అన్నది ఈ సర్వేలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: