నేటి రోజుల్లో ప్రత్యక్షదైవం ఎవరు అంటే టక్కున అందరికీ గుర్తొచ్చేది వైద్యులే. ఎందుకంటే ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభం సమయంలో వైద్యులు అందరి ప్రాణాలను కాపాడే ప్రత్యక్ష దైవాలు గా మారిపోయారు అన్న విషయం తెలిసిందే. అయితే వైద్యులు ఇప్పటినుంచి కాదు ఇది ఎప్పటి నుంచో ప్రజల ప్రాణాలను కాపాడాడుతూ  ఉన్నప్పటికీ... ప్రజలకు వైద్యుల అసలుసిసలైన విలువ తెలిసింది మాత్రం కరోనా వైరస్ సంక్షోభం కారణంగానే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చిన్న అజాగ్రత్తగా ఉన్న ప్రాణాలు పోతాయని తమ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వస్తుంది అని తెలిసినప్పటికీ కూడా ప్రజల ప్రాణాలను కాపాడడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టి ముందుకు కదిలారు వైద్యులు.


 కరోనా  సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడడానికి వైద్యులు చేసిన కృషి వెలకట్టలేనిది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే కరోనా  సమయంలోనే కాదు ఎన్నో క్లిష్ట సమయాల్లో కూడా వైద్యులు ఎంతో కష్టపడి మనిషి ప్రాణాలను నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని క్లిష్టమైన సర్జరీల విషయంలో ఎంతో కష్టపడి మనిషి ప్రాణాలను నిలబెడుతూ ఉంటారు. ఇక్కడ వైద్యులు చేసిన చికిత్స ప్రస్తుతం ఎన్నో ప్రశంసలు అందుకుంటోంది. ఓ వ్యక్తిని అవిటి వాడిగా కాకుండా కాపాడాడు వైద్యులు.



 చెయ్యి కాలు పూర్తిగా తెగిపడి పోయినప్పటికీ కూడా ఎంతో క్లిష్టమైన శస్త్ర చికిత్స చేసి.. ఆ భాగాలను అతికించారు. ప్రకాశం జిల్లాలో జరిగింది ఈ ఆసక్తికర ఘటన. సంతమాగులూరు మండలం మామిళ్ళపల్లి సాగర్ కాలువ వద్ద కృష్ణయ్య అనే వ్యక్తిపై ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో కృష్ణయ్య చేయి కాలు పూర్తిగా తెగిపోయాయి. ఈ క్రమంలోనే అతని గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు తీసుకు రాగా.. అక్కడ వైద్య బృందం 10 గంటలు  శ్రమించి శస్త్రచికిత్స చేసి తెగిపోయిన అతని భాగాలను మళ్లీ అతికించారు. ప్రస్తుతం ఇంత క్లిష్టమైన శస్త్ర చికిత్స చేసి సదరు వ్యక్తిని అవిటి వాడిలా కాకుండా కాపాడిన వైద్యులపై  ప్రశంసల వర్షం కురుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: