సాధారణం గా హైదరాబాద్ బిర్యానీ అంటే దేశ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో మంది ఒకసారి హైదరాబాద్ వచ్చారు అంటే బిర్యాని తినకుండా వెళ్లరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అంతలా  హైదరాబాద్ బిర్యాని  ఫేమస్ అయింది . ఇక ఎంతో ఫేమస్  హైదరాబాద్ బిర్యానీ ఇక నగరవాసులు తినకుండా ఉంటారా... కాస్త సమయం దొరికిందంటే చాలు హాయిగా బిర్యాని ఆరగిస్తూ సంతోష పడి పోతూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో కరోనా వైరస్ కారణంగా బిర్యానీ అమ్మకాలు భారీగా పడిపోయాయి అన్న విషయం తెలిసిందే.


 కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జనాలు బయటి ఆహారానికి దూరంగా పెట్టి కేవలం ఒక ఇంటి ఆహారాన్ని మాత్రమే ఎక్కువగా తీసుకుంటూ ఉండటం తో బిర్యానీకి పూర్తిగా గిరాకీ తగ్గిపోయింది. కానీ ప్రస్తుతం హైదరాబాద్ బిర్యానికి మరోసారి భారీ రేంజ్ లో గిరాకీ  పెరిగిపోయినట్లు  తెలుస్తుంది. దీనికంతటికీ కారణం జిహెచ్ఎంసి ఎన్నికలే . ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో బిర్యానీ విక్రయించే హోటళ్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే 80% బిజినెస్ పెరిగిపోయింది.



 దీనికంతటికీ కారణం ఆయా పార్టీలు ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలకు బాగా బిర్యానీలు పెట్టడమే. ఇక ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎంతో మంది కార్యకర్తలతో ప్రస్తుతం ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ  క్రమంలోని ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలకు.. ఉదయం టిఫిన్.. మధ్యాహ్నం లంచ్.. నైట్ భోజనం కూడా అన్ని చూసుకుంటున్నారు అభ్యర్థులు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం రాత్రి సమయంలో ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలకు బిర్యానీ ఇస్తున్నట్లు సమాచారం.  దీంతో బిర్యాని సెంటర్ లకు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో కరోనా  వైరస్ సమయంలో జరిగిన నష్టాన్ని ప్రస్తుతం బిర్యాని సెంటర్ లు పూడ్చుకుంటున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: