గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేసే విషయంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాస్త వెనకబడి ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 200కు పైగా స్థానాల్లో ఇప్పుడు తన అభ్యర్థులను నిలబెట్టినా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకునే విషయంలో మాత్రం ఘోరంగా వెనుకబడి ఉంది అనే విషయం చెప్పవచ్చు. నాయకులు పోటీ చేయడానికి ముందుకు వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం మాత్రం ప్రచారం చేసే విషయంలో వెనుకబడి ఉంది. అటు మీడియా కూడా పెద్దగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను పట్టించుకునే పరిస్థితి కనపడటం లేదు.

తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తోందని అని అంటున్నా సరే... తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పుడు ఎక్కువగా రాష్ట్ర నాయకత్వం విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటున్న సరే రాష్ట్ర నాయకత్వం ఎందుకు ప్రచారం చేయడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలపై తెలుగుదేశం పార్టీ నేత సినీ నటుడు బాలకృష్ణ ఆరా తీసినట్టు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నాయకులు కొందరు ప్రచారం చేయాలని ఆయన కొందరికి ఫోన్లు చేసి చెప్పినట్లుగా సమాచారం.

ఇప్పటికే నందమూరి సుహాసిని కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. త్వరలోనే బాలకృష్ణ కూడా ప్రచారానికి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. అదే విధంగా నందమూరి తారకరత్న కూడా ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. కొంతమంది నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం ప్రచారం చేయడానికి వెళ్తున్నారు. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ప్రచారం చేసే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి నారా లోకేష్ ప్రచారం చేస్తారా లేదా అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత కూడా లేదు. అటు చంద్రబాబు కూడా ప్రచారం చేసే విషయంలో ఆలోచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: