తెలంగాణలో ఇప్పుడు కొన్ని కొన్ని అంశాల గురించి ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అసలు ఆ పార్టీలో ఉంటారా లేదా అనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతోంది. అయితే రేవంత్ రెడ్డి కి సంబంధించి కొన్ని వార్తలు మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి కరంగా ఉన్నాయి. ఏంటి అనేది ఒకసారి చూస్తే రేవంత్ రెడ్డి బిజెపి అధిష్టానం కొన్ని ఆఫర్లు ఇచ్చింది అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి.

ఆఫర్లు ఏంటి అనేది తెలియక పోయిన ఆయనకు వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఇచ్చే సీటుపై హామీ తో పాటుగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను కూడా అప్పగిస్తాము అని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకా స్పష్టత లేకపోయినా త్వరలోనే దీనిపై ఒక ప్రకటన బీజేపీ నేతలు చేసే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అవకాశాలు కూడా లేవు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇతర పార్టీలోకి వెళ్లడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ తరుణంలో రేవంత్ రెడ్డిని బీజేపీ తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి రాజకీయంగా కాస్త దూకుడుగానే ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీని విమర్శించే విషయంలో బీజేపీ నేతల కంటే కూడా ఆయన ఎక్కువ దూకుడుగా ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి బీజేపీ లోకి వస్తే బీజేపీకి కాస్త లాభం చేకూరే అవకాశాలు ఉంటాయి అనే అభిప్రాయం రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అందుకే బీజేపీ నేతలు ఆయన విషయంలో కాస్త ఎక్కువగా ఫోకస్ చేసారు అని ప్రచారం జరుగుతోంది. మరి రేవంత్ రెడ్డి ఏ పార్టీలో కి వెళ్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: