ఏపీలో ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సామరస్యం అసలు లేదు అని అంతా అంటారు. అది కనిపిస్తోంది కూడా. స్థానిక ఎన్నికల మీద ఇపుడు చూస్తే రచ్చగానే ఉంది. ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలకు సై అంటోంది. రాష్ట్ర ప్రభుత్వం నై అంటోంది. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు అసలు ఏపీలో లోకల్ బాడీ  ఎన్నికలు జరుగుతాయా అన్న డౌట్లు కూడా  వస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈ మధ్యన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల ప్రధానాధికారి హోదాలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు అంతా సుముఖంగా ఉన్నారు కాబట్టి ఎన్నికలు పెడతామని ఆయన ఓ భారీ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. ఫిబ్రవరిలో లోకల్ బాడీ ఎన్నికలు అని కూడా చెప్పేశారు. అయితే ఇపుడు తాజాగా బీజేపీ ఎందుకు ఇంత తొందర అంటోంది. లోకల్ బాడీ ఎన్నికలకు ఎందుకు హడావుడి పడుతున్నారు అంటూ నిమ్మగడ్డను నిలదీస్తోంది.

ఓ వైపు కరోనా ఉంటే ఎన్నికలు ఎలా పెడతారు అని కూడా ఆ పార్టీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు గట్టిగానే అడుగుతున్నారు. ఎన్నికలు ఇపుడు అంత అర్జంట్ విషయం కాదని కూడా ఆయన అంటున్నారు. ఇది చూస్తే అచ్చం వైసీపీ స్టాండ్ గానే ఉంది. వైసీపీ కూడా ఇప్పటిదాకా అదే కోరుతూ వస్తోంది. ఎన్నికలు పెట్టడానికి కరోనానే కారణంగా చెబుతోంది.

మరి దానికి జాతీయ పార్టీ అయిన బీజేపీ కూడా తోడు కావడంతో నిమ్మగడ్డకు బ్రేక్ పడినట్లేనని అంటున్నారు. ఇక జనసేన కూడా తమ అభిప్రాయం ఇదీ అని చెప్పలేదు. ఇలా టీడీపీ తప్ప  ప్రధాన పార్టీలు అన్నీ కూడా ఎన్నికలకు సుముఖంగా లేవని అర్ధమవుతున్న వేళ నిమ్మగడ్డ వీటీ కాదనుకుని ఎలా ముందుకు వెళ్తారు అన్నది ప్రశ్న. ఇక జగన్ వాదనకు బీజేపీ మద్దతుగా నిలవడం వల్ల ఏపీ రాజకీయాల్లోనూ పెను మార్పులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: