మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై  చెప్పారు.. రేపే ఢిల్లీ కి పయనం  కానున్నారు .. కొన్ని రోజులుగా సాగిన సందిగ్దతకి ఈరోజు తెర  పడింది .. గత కొన్ని రోజులుగా విజయశాంతి  బీజేపీ లోకి చేరుతున్నారు అనే వార్తలు వినబడ్డాయి .. అందులో ఏమాత్రం నిజం లేదని కొందరి వాదన ..కానీ ఇప్పుడు ఆ మాటని నిజం చేస్తూ ఎట్టకేలకు రాములమ్మ  బీజేపీ లోకి చేరడం దాదాపు ఖాయం అయిపొయింది ...  

గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న విజయశాంతి ,పార్టీ కార్యక్రమాలకి చురుగ్గా పాల్గొనడం లేదు.. అలాగే పార్టీ సమావేశాలకు కూడా సరిగా హాజరు కాకపోవడం ఇందు మూలంగా అందరిలో ఒక ప్రశ్న ఎదురైంది .. అదే విజయశాంతి కాంగ్రెస్ పార్టీ ని విడనున్నారా అని .. అందులో నిజం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులూ కొట్టిపడేసారు ..విజయశాంతి కాంగ్రెస్ పార్టీ లోనే ఉంటారని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు ..

కానీ మొన్న జరిగిన దుబ్బాక ఎన్నికల సందర్బంగా విజయశాంతి  కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి తో సమావేశం కావడం ఆసక్తిని  రేపింది .. ఆలా కిషన్ రెడ్డి తో భేటీ కావడం తో విజయ శాంతి  బీజేపీ లోకి చేరుతున్నారా అనే వార్త  రాష్ట్రమంతతా వ్యాపించింది .. అక్కడినుండి విజయ శాంతి తన సహచరులతో రోజు  సమావేశమై  బీజేపీ లో చేరడం పై ఆలోచనలు చేసినట్లు తెలుస్తుంది ..  ఎట్టకేలకు  ఈరోజు  విజయ శాంతి  బీజేపీ లోకి చేరుతున్నట్లు తన నిర్ణయాన్ని ప్రకటించింది ..  ఇలా నిర్ణయం  తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ లో గుబులు రేపింది   చెప్పుకోవచ్చు ..

 విజయశాంతి రేపే తన అనుచరులతో ఢిల్లీకి వెళ్లనున్నారు  ..రేపు బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి సమక్షం లో పార్టీలోకి చేరనున్నారు .. అనంతరం కేంద్ర ప్రముఖులతో భేటీ కానున్నారు .. బీజేపీ లోకి చేరిన అనంతరం విజయశాంతికి కీలకమైన బాధ్యతలను అప్పగించే  అవకాశం ఉన్నట్లు కనబడుతుంది అంతే కాదు గ్రేటర్ ఎన్నికల వేళా బీజేపీ  అభ్యర్థుల పార్టీ ప్రచార కార్యక్రమంలో కూడా పాల్గొననున్నట్లు తెలుస్తుంది ..

 


మరింత సమాచారం తెలుసుకోండి: