ఏపీలో ఇప్పుడు ఉద్యోగులు కాస్త నిరసన మార్గాల ద్వారా ముందుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారని అర్ధమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి గానూ ఇప్పుడు కొత్త కొత్త కార్యక్రమాల ద్వారా అడుగులు వేస్తున్నారు. ఇక తాజాగా ఏపీ ఉద్యోగుల నేత ఒకరు కీలక వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆస్కార్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తానన్న రాయితీలను ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఇక ఐదు డీయేలు పెండింగ్ ఉన్నాయి వాటిని  అమలు చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు.

స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడుతూ... ఎన్నికలకు మా ఉద్యోగులు సిద్ధంగా లేరని తెలియజేస్తున్నాం అన్నారు. కాంట్రాక్టు విధానాలపై, ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది అని వ్యాఖ్యలు చేసారు. చాలా మంది ఐఏఎస్ అధికారులు కార్యాలయానికి రావడం లేదు అని... చాలా మంది ఉద్యోగులు పని చేస్తున్నారు అని పేర్కొన్నారు. పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి అని ఆయన కోరారు. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు.  చాలా ఆసుపత్రిలలో వైద్యం అందించే పరిస్థితి కనిపించడం లేదు అని ఆయన వ్యాఖ్యాన్నించారు.

మెరుగైన హెల్త్ కార్డు విధానం  తీసుకురావాలి అని డిమాండ్ చేసారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పూర్తి అవగాహన రాకముందు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని,  వారి మీద చర్యలకు పాల్పడుతున్నారు ఇది తగదు అని ఆయన హెచ్చరించారు. గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి అని కోరారు. కొంతమంది మా ఉద్యోగ సంఘాన్ని రద్దు చేయాలని కోర్టులో కేసు వేశారు వారికి చుక్కెదురైంది అని ఆయన అన్నారు. ప్రభుత్వం పట్ల ఎంత బాధ్యత ఉందో ఉద్యోగుల సమస్యల పట్ల అంతే బాధ్యతగా వ్యవహరిస్తాం అని ఆయన స్పష్టం చేసారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని... లేదంటే మేము కూడా  రోడ్డెక్కి పరిస్థితి వస్తుంది అని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: