నిజాం నవాబు హైద్రాబాద్ కు గొప్ప గుర్తింపు ను తెచ్చారు అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. అభివృద్ధిని తెలంగాణ ఆవిర్భావానికి ముందు తర్వాత చూడాలి అని ఆయన సూచించారు.  మొన్నటి వరదలను ప్రకృతి వైపరీత్యంగా చెప్పి ప్రభుత్వం తప్పించుకుంటోందని మండిపడ్డారు. ఆక్రమణలు  ప్రకృతి వైపరీత్యాలకు కారణం కాదు అని, దీనికి కేసీఆర్, కేటీఆర్ బాద్యులు అని ఆయన అన్నారు.  కేటీఆర్ విడుదల చేసిన ప్రగతి నివేదిక అబద్ధాల పుస్తకం అని ఆయన మండిపడ్డారు. మెట్రో రైల్ కు టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం సంబంధం అని నిలదీశారు.

రాజధానిలో అభివృద్ధి కోసం పెట్టిన ఖర్చు కేవలం 6 వేల కోట్లు మాత్రమే అన్నారు. అందులో 2 వేల కోట్లు అప్పు తెచ్చారు అని ఆయన వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ వల్లే మెట్రో వ్యయం పెరిగింది అని మండిపడ్డారు. ఉస్మానియా హాస్పిటల్లో కనీసం సౌకర్యాలు కూడా మెరుగు పరుచలేదు అని వ్యాఖ్యలు చేసారు. వందేళ్లలో జరగని ఆక్రమణలు కేసీఆర్ వచ్చిన అరేళ్లలో జరిగాయి అని అన్నారు. మంత్రి మల్లారెడ్డి, అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి కాలేజీ లు చేరువులోనే ఉన్నాయని ఆయన విమర్శలు చేసారు. విద్యా, వైద్యాన్ని నిర్లక్ష్యం చేశారు అని ఆయన విమర్శించారు.

హైద్రాబాద్ ను విధ్వంసం చేశారు అని విమర్శించారు. ఒక మంత్రి అల్లుడి కంపెనీ ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ చేస్తోంది అని ఆయన మండిపడ్డారు. రమ్మీ డాట్ కామ్ అడ్డా ద్వారా గ్యాంబ్లింగ్ నడుస్తోంది అని అన్నారు. ఓ మంత్రి వియ్యంకుడు గుట్కా వ్యాపారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యలు చేసారు. గుట్కా, మట్కా, వైన్, మైన్ అంతా ప్రభుత్వ పెద్దలు కనుసన్నళ్ళల్లో నడుస్తోంది అని విమర్శించారు. వీటన్నింటికి కారణం ప్రశ్నించే గొంతు లేకపోవడమే అని, ప్రశ్నించే గొంతులను నలిపేస్తున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రశ్నించే వారిని గెలిపించండని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: