అమరుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు, వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక... ప్రజల పనులలో చాలా మార్పులు వచ్చాయి అనే చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఎన్నో సంస్కరణలను చేపట్టింది  జగన్ సర్కారు. తాజాగా ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక అంశంతో మన ముందు నిలిచింది జగన్ ప్రభుత్వం. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సామాజిక ఆసుపత్రిని నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఇందుకు పునాది కూడా పడింది. వైద్య సేవలను మరింత మెరుగ్గా అందించే దిశగా... పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సామాజిక ఆసుపత్రిని రూ.11.64 కోట్లతో 100 పడకల ఆసుపత్రిగా విస్తరించే అభివృద్ధి పనులకు మంత్రి ఆళ్ల నాని శనివారం శంకు స్థాపన చేసి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా వార్తా విలేకరులతో మాట్లాడారు ఆళ్ల నాని. ఈ విషయమై పలు అంశాలను ప్రస్తావించారు. గతంలో టిడిపి సర్కారు ఉన్న సమయంలో వారి ప్రభుత్వం ఆరోగ్య శాఖ ను సరిగా పట్టించుకోలేదని.... నిజానికి ఆరోగ్యశ్రీ ని పక్కన పెట్టిందని... ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రికి రావాలంటేనే పలుమార్లు ఆలోచించేలా ఆసుపత్రులను భ్రష్టు పట్టించిందని.... ఆసుపత్రులను విస్తరించే పనులు చేపట్టడం దేవుడెరుగు కానీ.... కనీసం శిథిలావస్థకు చేరిన సీహెచ్‌సీ, పీహెచ్‌సీ ఆసుపత్రి భవనాలకు కనీసం మరమ్మతులు కూడా చేయలేదని.... పేషెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదని విమర్శించారు. కానీ గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా చెప్పాల్సిన అవసరం లేదని.... సమస్యలన్నింటినీ పరిష్కరించడంలో వైసిపి ప్రభుత్వం  ఎప్పుడూ ముందుంటుందని... ఇక ఆరోగ్యశాఖ విషయానికొస్తే.....తమ ప్రభుత్వం వైద్యరంగంలో మార్పులను తీసుకు వచ్చిందని... రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్‌ కళాశాలల నిర్మాణం చేపడుతోందని.. అందుకు కావలసిన ప్రణాళికలను రచిస్తోంది....

ప్రపంచానికి వైద్యులను అందించే మరో 11 మెడికల్‌ కళాశాలలను ఆధునికీకరించబోతున్నామని సగర్వంగా తెలిపారు . అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో, పీహెచ్‌సీల్లో ఖాళీగా ఉన్న 9,700 పోస్టులు భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యిందని, త్వరలో మరో 1,900 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజల ప్రాణాలను రక్షించే ఆరోగ్యశాఖ ఎంతో కీలకమని. అటువంటి ఆరోగ్య సేవలను సామాన్యులకు అందుబాటులోకి తేవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలలో ఒకటని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: