కరోనా ప్రళయం ఇంకా ఓ అంచనాకు రాలేదు. ప్రపంచం నలుమూలలా కేసులు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు కరోనా కి వ్యాక్సిన్ వస్తుందా అని ప్రజలంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే కొన్ని కంపెనీలు ప్రకటించిన వ్యాక్సిన్ లతో ఏ మాత్రం తృప్తి పడని వైద్యులు మరియు ఇతర దేశాల ప్రభుత్వాలు, ఇప్పుడు భారమంతా భారత్ పైనే వేశారు. అయితే అంతగా ప్రజలను ఆకట్టుకోని వ్యాక్సిన్లు ఏమిటి అలాగే ఎందుకు ప్రపంచ దేశాలు భారత్ పైనే ఆధారపడుతున్నాయో తెలుసుకోవాలనుందా అయితే కింద ఇచ్చిన ఏపీహెరాల్డ్ ఆర్టికల్ ను ఒకసారి చదవండి.

ఇటీవల విడుదలయిన కరోనా వ్యాక్సిన్లు ఫైజర్ మరియు మోడెర్నా లాంటి కంపెనీలు,  వాటి ప్రభావం 90 శాతం ఉంటాయంటూ రక రకాల ప్రకటనలు చేస్తున్నారు. దీనితో ప్రజలంతా మొదటగా సంతోషపడినప్పటికీ శాస్త్రవేత్తలు ఇవి అంత ప్రభావవంతంగా లేవని చెప్పడంతో ఆశ కాస్త ఆవిరైపోయింది.  అంతేకాకుండా ఈ వ్యాక్సిన్ల ధర విషయంలోనూ ప్రజలు సంతోషంగా లేరు. వీటన్నింటి కారణాల వలన ఈ రెండు కంపెనీల వ్యాక్సిన్లపై ఆధారపడకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వ్యాక్సిన్ ను నిల్వ ఉంచడం అంత తేలికైన విషయం కాదని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇన్ని ప్రతికూలతల మధ్య ఈ వ్యాక్సిన్ సక్సెస్ కావడం కష్టమే అనే టాక్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ప్రపంచ దేశాల చూపు భారత్ మీద పడింది. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ‘కొవిషీల్డ్’ను ఉత్పత్తి చేయనున్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వైపు ప్రపంచంలోని పేద.. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇప్పుడు ఆశగా చూస్తున్నాయి. ఎందుకంటే.. ఈ వ్యాక్సిన్ రెండు డోసుల ధర తక్కువ ధరను కలిగి ఉండడం,  మరియు స్టోర్ చేసే విధానం కూడా 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ వద్ద అవకాశం ఉండడంతో దీనిపైనే అందరి కన్ను ఉంది. దీనితో కంపెనీ యజమానులు డిసెంబర్ లో దీని అనుమతి కోసం అప్లై చేసుకుంటామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: