దక్షిణాఫ్రికా లోని జొహాన్నెస్ బర్గ్  లో   జాతిపిత మహాత్మా గాంధీ మునిమనవడు సతీష్ ధుపేలియా మరణించారు .. ఆయన కరోనా తో మృతి చెందినట్లు సోదరి ఉమా ధూపేలియా తెలిపారు .. కరోనా కారణంగా సతీష్ చనిపోవడం అయన కుటుంబం లో తీవ్ర విషాదాన్ని  నింపింది ..

దక్షిణాఫ్రికా లోని  జొహాన్నెస్​బర్గ్​ లో కొంతకాలంగా నివాసం ఉంటున్న సతీష్ న్యూమోనియా లో బాధపడుతున్నారు .. కరోనా సమయం లోనే న్యుమోనియా తో సతమతమవుతున్న సతీష్ దానికి తోడుగా వైరస్ కూడా సంక్రమించడం తో ఆరోగ్య సమస్యలు మరింత పెరిగాయి .. ఈ ఆరోగ్య పరిస్థితుల నడుమ నిన్న సతీష్ కి గుండెపోటు రావడం తో మృతి  చెందారు..

మహాత్మా గాంధీ మునిమనవడు దక్షిణాఫ్రికా లోనే ఉంటూ అక్కడే గాంధీ డెవలప్మెంట్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు ..అలాగే ప్రతి నిత్యం సామజిక కార్యక్రమంలోను  చురుగ్గ్గా పాల్గొనేవారు  .. సతీశ్ ధుపేలియా తన జీవిత కాలం  మొత్తం లో ఎక్కువ భాగం మీడియా రంగం లోనే గడిపారు  ..అలాగే ఫోటోగ్రాఫర్ గా కూడా పనిచేసారు ..  ..

కరోనా ని తేలికగా తీసుకోవద్దు ..ఇప్పుడు కరోనా కారణం గానే సతీష్ ధుపేలియా మరణించారు .. కరోనా వస్తే జాగ్రత్త చర్యలు తీసుకోవడం తప్పించి వేరేవి ఏమి లేవు .. కరోనా కి ఒక చికిత్స లేదు .. కరోనా వస్తే తగ్గడానికి మందు లేదు ..కాబట్టి కరోనా రెండో సారి వచ్చే ప్రమాదం ఉంది.. కనుక జాగ్రత్తగా ఉండండి . కరోనా వల్ల దేశం లోని ప్రముఖులెందరో మరణించారు .. ఒకసారి కరోనా వచ్చిన వారికీ  రెండో సారి కూడా వచ్చే ప్రమాదం ఉంది కనుక ప్రభుత్వాలు చెప్పే జాగ్రత్తలని పాటించండి ..అరోగ్యంగా ఉండండి ..  ఇప్పటికే మన దేశం లో కరోనా సెకండ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తున్న విషయం తెలిసిందే ..

మరింత సమాచారం తెలుసుకోండి: