కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం తీవ్ర స్థాయిలో కష్టపడుతుంది. ఈ  నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. సీఎం కేసీఆర్ కు కేటీఆర్ కు అబద్ధాలు చెప్పడం లో గిన్నిస్ బుక్ లో మొదటి స్థానం ఇవ్వొచ్చు అని ఆయన అన్నారు. గత 2016 ఎన్నికల్లో 100 రోజుల ప్రణాళిక అన్నారు అని, డబల్ బెడ్ రూమ్ ఇల్లు లక్ష అన్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏమైంది..? అని ఆయన నిలదీశారు.

ఇంటర్ నెట్ ఫ్రీ అన్నారు ఏమైంది? అని ప్రశ్నించారు. ఎంబీసీ లకు కార్పొరేషన్ ఎక్కడ? అని ఆయన నిలదీశారు. మాటంటే మాట అని సీఎం అన్నారు ఏం మాటయ్య నీది అని ఆయన ఎద్దేవా చేసారు. ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరలేదు అని మండిపడ్డారు. యువకులకు నిరుద్యోగ భృతి ఎక్కడ? అని ఆయన ప్రశ్నించారు. అవి ఇస్తా ఇవి ఇస్తా అని వాగ్దానాలు ఇస్తున్నాడు అని ఆయన విమర్శించారు. గతంలోఇచ్చిన వాగ్ధానాలే అమలు కాలేదు అన్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు మోసగాళ్లే అని ఆయన విమర్శించారు.

నేను రెండు ఛాలెంజ్ లు విసురుతున్న కేసీఆర్ కేటీఆర్ కి... పాతబస్తీ మెట్రో ఎక్కడా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ ముందు  నుండి మెట్రో అవసరమా కేసీఆర్ అన్నాడు..? అని, 18,300 కోట్లు హైదరాబాద్ అభివృద్ధి కి మెట్రో కోసం నిధులు చెప్పాము అని ఆయన వివరించారు. కేటీఆర్ 17000 కోట్లు ఖర్చు చేసామంటున్నారు అని... కేటీఆర్ సిగ్గుండాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ ఇంచార్జ్ మినిస్టర్ గా గతంలో నేనే ఉన్నాను అని, హైదరాబాద్ కుండల ప్రదర్శన లేదు అంటున్నావ్ అని... కానీ కృష్ణ జలాలు హైదరాబాద్ కి తీసుకొచ్చింది కాంగ్రెస్సే అని గుర్తు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: