చిత్ర పరిశ్రమలో 40వేల మంది పనిచేస్తున్నారు అని వారి అందరికి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు అందజేస్తాం అని సిఎం కేసీఆర్ అన్నారు. సినిమా హాళ్లకు తిరిగి ప్రారంభం అయ్యే వరకు విద్యుత్ చార్జీలు రద్దు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సినీమా హాళ్లు తెరుచుకోవడానికి ఈ రోజే జీవో ఇస్తాం అన్నారు ఆయన. చిన్న సినిమాలకు 9శాతం జిఎస్టీ రియంబర్స్ మెంట్ అవకాశం కల్పిస్తాం అని ఆయన వ్యాఖ్యానించారు. టికెట్ల రేట్లు సవరించుకునే అవకాశం ఇస్తాం అని ఆయన వ్యాఖ్యలు చేసారు. వరద నీటి నిర్వహణకు మాస్టర్ ప్లాన్ అమలు చేస్తాం అని స్పష్టం చేసారు.

మూసి రివర్ ను గోదావరి తో అనుసంధానం చేస్తాం అని ఆయన పేర్కొన్నారు. మెట్రోను రిపోర్ట్ కవరకు లింక్ చేస్తాం అని ఆయన చెప్పుకొచ్చారు. 1.67కోట్లు హెచ్ఎండీఏ పరిధిలో జనాభా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. రీజినల్ రింగ్ రోడ్డు ఇస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడగారి పారిపోయారు అని, 560కోట్లతో శాంతిభద్రతల కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించాము అని ఆయన పేర్కొన్నారు. జిహెచ్ఎంసి అభివృద్ధి కి రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరం అన్నారు. వేరే వాళ్లు గెలిచి జిహెచ్ఎంసి లో చేసేది ఏమి లేదు అని ఆయన వ్యాఖ్యలు చేసారు.

6లక్షల 56 కుటుంబాలకు వరద సహాయం అందించాము అని ఆయన అన్నారు. అర్హులందరికీ ఎన్నికల తర్వాత 10వేల వరద సహాయం ఇస్తాం అని స్పష్టం చేసారు. శాంతి సామరశ్యాలు కాపాడుకోవాలి అని, మతకల్లోలాలు కావాలా ప్రజలు ఆలోచించుకోవాలి అని ఆయన సూచించారు. కల్లోలాలు జరిగితే రియల్ ఎస్టేట్ దెబ్బతింటుంది అని ఆయన అన్నారు. భూముల ధరలు పడిపోతాయి అని, అందరి హైద్రాబాద్ కావాలా? కొందరి హైద్రాబాద్ కావాలా అని ఆయన ఆయన నిలదీశారు. చాలా మంది పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు అని, బోనాల జాతర వస్తే గుళ్లకు రంగులు వేశాము అని ఆయన వ్యాఖ్యానించారు. ముస్లిం, క్రిస్టియన్ అన్ని మతాల వారిని గౌరవిస్తున్నాం అన్నారు. కులాలు, మతాల పేరిట కొట్టుకునే భారత్ తమకు పోటీనే కాదని చైనా ఏర్పాటు చేసిన కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అని ఆయన చెప్పుకొచ్చారు. దేశానికి కొత్త అవిష్కర్త కావాలి..అది నేనే అవుతా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: