గ్రేటర్ హైదరాబాద్ లో ప్రచారం చేసే విషయంలో ఇప్పుడు బిజెపి నేతలు కాస్త దూకుడుగా ఉన్నారు. ప్రతీ విషయంలో కూడా ఇప్పుడు బిజెపి నేతలు తెరాస సర్కార్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయంగా బలపడే క్రమంలో కాస్త దూకుడుగా అడుగులు వేస్తుంది. గ్రేటర్ లక్ష్యంగా పెట్టుకుని ప్రతీ ఒక్కటి కూడా దూకుడుగా వెళ్తుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రారంభించారు బిజెపి యువనేత, ఎంపీ తేజస్వీ సూర్య.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హైద్రాబాద్ ను భాగ్యనగరంగా మార్చటమే బీజేపీ లక్ష్యమన్న తేజస్వీ సూర్య... ఓవైసీ సోదరులు జిన్నా వారసులు అని ఆయన మండిపడ్డారు. నిజం కాలం‌ కాదు‌‌..‌ దేశంలో నరేంద్ర మోదీ రాజ్యం నడుస్తోందని ఓవైసీ గుర్తుంచుకోవాలి అని ఆయన హెచ్చరించారు. ఎంఐఎంకు ఓటు వేస్తే.. ఓవైసీలు దేశశమంతటా బలపడే అవకాశం ఉంది అని, తెలంగాణ యువత దేశంలోనే అత్యంత ప్రతిభావంతులు అని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ మంది తెలంగాణ వారున్నారు అని ఆయన వివరించారు. దేశంలో జరిగే అన్ని పోటీ పరీక్షల్లో  తెలంగాణ , ఏపీ  యువతే ముందుంటారు అని ఆయన చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ ల మాదిరి.. గ్రేటర్ లో ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వండి అని ఆయన వ్యాఖ్యలు  చేసారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు..  దక్షిణ భారతదేశంలో మార్పుకు శ్రీకారం కావాలి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం ఒక్క కుటుంబం కోసమే పనిచేస్తోంది అని ఆయన మండిపడ్డారు. తెలంగాణను కేసీఆఆర్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ కంపెనీగా మార్చారు అని మండిపడ్డారు. తెలంగాణలో అసలైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో కుటుంబ పార్టీలను శాశ్వతంగా క్వారంటైన్ కు పంపించాలి అని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: