ఏపీలో టీడీపీ నేతలు ఇప్పుడు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయంగా బలపడే ప్రయత్నంలో భాగంగా సిఎం జగన్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ప్రతీ అవకాశంలో కూడా టీడీపీ నేతలు కాస్త సిఎం జగన్ మీద ఎక్కువగానే విమర్శలు చేయడం  ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా టీడీపీ మహిళా నేత ఒకరు సిఎం జగన్ టార్గెట్ గా విమర్శలు చేసారు. ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి మీడియా సమావేశం నిర్వహించారు. కాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీ... జగన్ రెడ్డి పగతో అమరావతి ఇబ్బంది పడుతున్నాయి అని ఆమె అన్నారు.

జగన్ రెడ్డి  ఒక చేత్తో అమరావతిని, మరో చేత్తో పోలవరాన్ని పొడిచారు అని ఆమె వ్యాఖ్యలు చేసారు.     ఎస్సీ రైతులపై అట్రాసిటీ కేసులు పెట్టి ఏం మూటగట్టుకున్నారు అని ఆమె నిలదీశారు. అదే విధంగా స్టేటస్ కో ఉన్నా విశాఖలో 30 ఎకరాల్లో అతిధి గృహం నిర్మించడం కోర్టు ఆదేశాలను ధిక్కరించడం కాదా? అని ఆమె ప్రశ్నించారు. 342 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తుంటే పరామర్శించని పాలకుడు దేశంలో ఎవరైనా ఉన్నారా?  అని ఆమె నిలదీశారు.     రైతుల పోరాటం భావితరాలకు స్ఫూర్తిగా ఉంటుంది అని ఆమె చెప్పుకొచ్చారు.

మూడు ప్రాంతాల్లో తట్ట మట్టైనా వేశారా? అని ఆమె నిలదీశారు.     ఉత్తరాంధ్రలో ట్రాన్స్ ఫార్మర్, కోస్తాంద్రలో ప్రహరీ గోడ, రాయలసీమలో బోరింగ్ తప్ప ఒక్క ప్రాజెక్టైనా ఉందా? అని ఎద్దేవా చేసారు. 17 నెలలుగా రాష్ట్రాభివృద్ధిని ఐసీయూలో పెట్టారు అని ఆమె అన్నారు. అమరావతి మీద ప్రేమ ఉంటే నిలిపేసిన పనులు ఎందుకు చేయడం లేదు.? అని నిలదీశారు. ఉద్యమంలో పాల్గొంటే రేషన్ బియ్యం ఇవ్వమని వాలంటీర్లతో బెదిరిస్తున్నారు? అని మండిపడ్డారు. అమరావతి గుర్తొచ్చిన ప్రతిసారి రైతులపై కేసులు  పెడుతున్నారు అని, దళితులు ఆర్థికంగా ఎదిగడం జగన్ రెడ్డికి ఇష్టం లేదు అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: