తెలంగాణాలో బలపడాలి అని భావిస్తున్న బిజెపి నేతలు కొన్ని కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా బిజెపి నేత బాబు మోహన్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తిరుపతికి నాకు అవినాభావ సంబంధం ఉంది అని ఆయన అన్నారు. నెలకు నాలుగు సార్లు షూటింగ్ పనిమీద వచ్చేవాడిని అని ఆయన చెప్పుకొచ్చారు. సమయం దొరికినపుడు శ్రీవారిని దర్శించుకునే వాడిని అన్నారు. కెసిఆర్ కుటుంబ సభ్యుల ఉన్న దుబ్బాక ఉప ఎన్నిక లో బిజెపి ఘన విజయం సాధించింది అని ఆయన అన్నారు.

శ్రీవారికి మూడు దండాలు పెట్టుకున్న, మొదటిది దుబ్బాక, రెండవది జి హెచ్ ఎమ్ సి, మూడవది తిరుపతి ఉప ఎన్నిక అని ఆయన వివరించారు. త్వరలోనే మూడు దండాలు ప్రతిఫలం వస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు. జి హెచ్ ఎమ్ సి ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం అన్నారు. తెలంగాణ లో కుటుంబ పాలన కొనసాగుతోంది, అర్జంటుగా కేటీఆర్, కవితని కీలక పదవుల్లో కూర్చోపెట్టాలని కెసిఆర్ చూస్తున్నడు అని మండిపడ్డారు. తెలంగాణ లో రైతుల కష్టాలు వర్ణనాతీతం, రైతును చులకనగా చూస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు.

అప్పట్లో యన్ టి ఆర్ ప్రజలే దేవుళ్ళు అన్నారు, కానీ ఇప్పుడు పాలకులకు ప్రజలు భానిసలుగా మారారు అని ఆయన విమర్శించారు. తెలంగాణ లో ప్రజలను చావు కొడుతున్నారు, ఏపీలో జగిగే అన్యాయాలను ప్రజలు ప్రశ్నిస్తే గుండు కొడుతున్నారు అని విమర్శించారు. విజయశాంతి బిజెపి కి వస్తుందని నమ్మకం ఉంది అన్నారు. సినీ నటులు బిజెపి వైపు చూస్తున్నారు, మోడీ నాయకత్వంలో దేశం సస్యశ్యామలం అవుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో బిజెపి అభివృద్ధికి కృషి చేస్తా అని ఆయన వివరించారు. జి హెచ్ ఎమ్ సి ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు మంచి ఫలితాన్ని ఇస్తుంది అన్నారు. హైదరాబాద్ లో మెగా ఫ్యామిలీ కి ఉన్న క్రేజ్ జి హెచ్ ఎమ్ సి ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: