మహిళలు, చిన్నపిల్లల రక్షణ కోసం అభయం ప్రాజెక్ట్, అభయం యాప్ ను వర్చువల్ గా ఆవిష్కరించిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి... కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రయాణించే మహిళలు తమ మొబైల్ లో ఉన్న యాప్ ద్వారా ట్రిప్ స్టార్టింగ్, ఎండింగ్ ఫిక్స్ చేసి ఆటోలోని క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే పోలీసులకు పూర్తి వివరాలు అందుతాయి అని ఆయన అన్నారు. ఆటో రూట్ మారినా, తెలియని ప్రదేశానికి వెలుతున్నా...వెంటనే ప్యాసింజర్ కు మెసేజ్ వస్తుంది అని ఆయన వివరించారు. వెలుతున్న దారి తెలిసిన మార్గమైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని ఆయన అన్నారు.

తెలియని మార్గం ఆటో పోతూ ఉంటే ఆటోలో ఉన్న ఐఓటి డివైజ్ ను నొక్కి ప్యానిక్ అలారంను మ్రోగించవచ్చని ఆమె చెప్పుకొచ్చారు. వెంటనే కంట్రోల్ రూమ్ లోనూ, ఆటో వద్ద అలారం రావడంతో పాటు ఆటోకు ఇంధనం నిలిచిపోతుంది అని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్ట్ ను తీసుకురావడం వెనుక రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లల చిత్తశుద్దిని శంకించినట్లు కాదు అని సిఎం జగన్ అన్నారు. వీటిని ఏర్పాటు చేయడం వలన దేశీయ ఆటోలు, ట్యాక్సీలు ఓలా, ఉబర్ లాంటి సంస్థలతో పోటీ పడగలుగుతాయని చెప్పుకొచ్చారు.

అటు ప్రయాణికులలోనూ, మన ఆటోలు, ట్యాక్సీల పట్ల నమ్మకాన్ని పెంచుకోగలుగుతాం అని ఆయన అన్నారు. ఇప్పటికే దిశా యాప్ ను పోలీస్ శాఖ సమర్ధవంతంగా నిర్వహిస్తుంది అని, తాజాగా తీసుకువస్తున్న అభయం ప్రాజెక్ట్, అభయం యాప్ లను రవాణా శాఖ సమర్ధవంతంగా నిర్వహిస్తుంది అన్నారు. వచ్చే ఏడాది నవంబర్ 1నాటికి లక్ష ఆటోలకు అభయం ప్రాజెక్ట్ కింద ఐవోటి డివైజ్ లు అమరుస్తాం అని ఆయన చెప్పుకొచ్చారు. విశాఖ లో అభయం ప్రాజెక్ట్ ను పైలట్ గా ప్రారంభిస్తున్నాం అని, సుమారు వెయ్యి ఆటోలకు ఐవోటి డివైజ్ లను ఏర్పాటు చేసి లాంఛనంగా నేడు ప్రారంభిస్తున్నాం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: