సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ చాలావరకు దూకుడుగానే ఉన్నారు. అయితే ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో సీఎం జగన్ కాస్త ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా నిధుల సమీకరణ విషయంలో మంత్రుల నుంచి సహాయ సహకారాలు అనేది అందడం లేదు. ఒక వేళ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా సరే వాటిని ప్రచారం చేసుకునే విషయంలో కూడా రాష్ట్ర మంత్రులు ఘోరంగా వెనకబడి ఉన్నారు.

ఇక వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లే విధంగా వ్యాఖ్యలు చేయలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న కొన్ని ప్రచారాలను ఎదుర్కొనే విషయంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఘోరంగా వెనుకబడి ఉన్నారు అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. దీనివలన పార్టీ పరంగా ఎక్కువగా నష్టపోతున్నాము అనే భావన కొంతమందిలో వ్యక్తమవుతుంది. సీఎం జగన్ కూడా ఇప్పుడు ఈ వ్యవహారంపై కాస్త సీరియస్ గానే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే తెలుగుదేశం పార్టీని ప్రచారాన్ని ఎదుర్కొని నిలబడాలి

నిలబడి కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రజల్లోకి వెళ్లే విధంగా మనం వ్యాఖ్యలు చేయకపోతే మాత్రం పార్టీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని సీఎం జగన్ కొంతమంది వద్ద వ్యాఖ్యలు చేస్తున్నారు. కొంతమంది మంత్రులు సోషల్ మీడియా లో కనీసం యాక్టివ్ గా లేకపోవడంతో సీఎం జగన్ కి పెద్ద తలనొప్పిగా మారింది. అయితే ఇప్పుడు ఆయన కొన్ని శిక్షణ తరగతులను ఎమ్మెల్యేలకు ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే త్వరలోనే పార్టీకి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు విడుదల చేసే అవకాశం ఉందని కొన్ని షరతులను ఎమ్మెల్యేలకు మంత్రులకు సీఎం జగన్ పెట్టే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: