తెలంగాణలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. త్వరలోనే బిజెపి నుంచి కొందరు నేతలు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం ఎక్కువగా రాజకీయ వర్గాల్లో వినపడుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ కాస్త ఎక్కువగానే ఫోకస్ చేసింది. ముఖ్యంగా అదిలాబాద్ జిల్లాకు చెందిన కొంతమంది నేతలు ఇప్పుడు బీజేపీ నుంచి బయటకు తీసుకురావడానికి కొంతమంది కీలక నేతలు కష్టపడుతున్నారు.

అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఆరుగురు నేతలను ఇప్పుడు బయటకు తీసుకురావడానికి కాస్త ఎక్కువగానే కష్టపడుతున్నారు అని రాజకీయ వర్గాలంటున్నాయి. బండి సంజయ్ తీరుతో ఆగ్రహంగా ఉన్న కొంతమంది నేతలు ఇప్పుడు బయటకు రావడానికి ఆసక్తి గా ఉన్నారు అని ప్రచారం జరుగుతోంది. కొంత మంది నేతల విషయంలో బీజేపీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలో బీజేపీ నేతలు అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో కొంత మంది కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు.

బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో ఆయన విషయంలో బీజేపీ కార్యకర్తలు జాగ్రత్తగానే ఉంటారు. ఆయనకు బలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయనను నిర్లక్ష్యం చేయవద్దు అని బీజేపీ నేతలు కార్యకర్తలు ఎక్కువగా కోరుకుంటారు. అయితే బిజెపి రాష్ట్ర నాయకులు మాత్రం ఆయన విషయంలో కాస్త ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆయన బీజేపీ నుంచి బయటకు రావచ్చు అని అయితే టిఆర్ఎస్ పార్టీలో చేరుతారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదని అంటున్నారు. అయితే ఆయన బయటకు వచ్చి స్వతంత్ర ఎమ్మెల్యే గా ఉండే అవకాశం ఉందని ఏ పార్టీలో కూడా చేరే అవకాశాలు లేక పోవచ్చు అని అంటున్నారు. అయితే ఇప్పుడు ఆయన బీజేపీ అధిష్టానానికి లేఖ రాసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: