ప్రస్తుతం భారత్ ప్రతి విషయంలో ఎంతో వ్యూహాత్మకంగానే ముందుకు వెళుతుంది అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా దౌత్యపరంగా అయితే ఈ మధ్య కాలంలో భారత దూకుడుగా ఏకంగా  ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గతంలో అయితే భారత శత్రు దేశాలు ఏమైనా విమర్శలు చేయడం చేసినప్పుడు కేవలం భారత్  వాటిని ఖండిస్తూ మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు శత్రు దేశాలు చేసిన విమర్శలను ఖండించడం కాదు ఏకంగా డైరెక్టుగా వార్నింగ్ కూడా ఇస్తోంది భారత్ . అగ్రరాజ్యాల ముందే వార్నింగ్ ఇస్తూ ప్రస్తుతం భారత దౌత్య పరంగా ఎంతో దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇటీవల ఏకంగా పాకిస్థాన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది భారత్.



 ఏకంగా ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది భారత్ .  ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారంలో పాకిస్తాన్ జోక్యాన్ని ఆపాలి అంటూ ఐక్యరాజ్యసమితిలో భారత్ పాకిస్తాన్ కు నేరుగా చెప్పి షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల రాజ్యం నడిచి విధ్వంసాలు సృష్టించడానికి కారణం అయ్యింది పాకిస్తాన్ అనే విషయం తెలిసిందే. ఆ తర్వాత కాలంలో అమెరికా ఎంట్రీ ఇవ్వడం తో  ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబన్ల రాజ్యం మొత్తం నాశనం అయింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి.



 ఇక ప్రస్తుతం ట్రంప్  గద్దె దిగిపోయి  జో బైడెన్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ మళ్ళీ ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్ రాజ్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో.. ఐక్యరాజ్య సమితి ముందు ఇదే ఆరోపణ చేసింది భారత్. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో పాకిస్తాన్ వేలు పెట్టకూడదు అంటూ సూచించింది. ప్రస్తుతం ఉగ్రవాదాన్ని అంతం చేస్తామంటూ పైపైకి మాటలు చెబుతున్నా పాకిస్తాన్.. ఆఫ్ఘనిస్తాన్ లో  మళ్లీ ఉగ్రవాదాన్ని  పెంచి పోషించేందుకు ప్రయత్నాలు చేస్తోందని దాన్ని ఆపకపోతే... తీవ్ర పరిణామాలను పాకిస్తాన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ పాకిస్థాన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: