ప్రస్తుతం ఉగ్రవాదులు భారత్లో ఎన్నో విధ్వంసాలు  సృష్టించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది  అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్య కాలంలో భారత్లో ఉగ్రవాదులు ఆగడాలు సాగడం లేదు అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉగ్రవాదులు సరికొత్తగా భారత్లో విధ్వంసాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.  అయితే ఉగ్రవాదుల కొన్ని కొన్ని సార్లు వివిధ దేశాల రక్షణ రంగాల కంప్యూటర్ నెట్వర్క్ పై సైబర్ దాడి చేసి కీలక సమాచారాన్ని దొంగలిస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే.



 ఇటీవలే విద్యుత్ విషయంలో కూడా ఇలా ఉగ్రవాదులు సైబర్ దాడి చేయడంతో ఏకంగా ఎంతోమంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటివరకు కేవలం రక్షణ రంగంలో మాత్రమే సైబర్ దాడి చేసి రక్షణ రంగానికి సంబంధించిన కీలక సమాచారాన్ని దొంగిలించే వారు కానీ ప్రస్తుతం ఇటీవలే ముంబై నగరంలో ఏకంగా విద్యుత్తు నిలిచిపోయే విధంగా ఉగ్రవాదులు సైబర్ దాడికి పాల్పడడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది.  విద్యుత్ విషయంలో ఇది విచిత్రమైనటువంటి పరిణామమే అని అంటున్నారు విశ్లేషకులు.



 ప్రస్తుతం భారతదేశంలో కి కరెంటును ఎన్నో ప్రైవేట్ సంస్థలు ఇస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం ఉగ్రవాదులు కూడా కరెంటు ను టార్గెట్ చేశారు. అక్టోబర్ 12వ తారీకున ముంబైలోని చాలా ప్రాంతాలలో కరెంట్ సరఫరా ఒక్కసారిగా ఆగిపోయింది. నగర శివారు ప్రాంతాల వారితో 10 నుంచి 12 గంటల వరకు కూడా కరెంటు ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజలు. అయితే ముంబై విద్యుత్ సరఫరా చేసే టాటా గ్రిడ్  లో లోపం అని అనుకున్నారు అందరు. కానీ ఆ తర్వాత అసలు నిజం బయటపడింది. లోడ్ డిస్పాచ్ సెంటర్ ను లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు  వాటిని చెడగొట్టడం తో ఈ సమస్య తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. సింగపూర్ దక్షిణాసియా దేశాలనుండి  ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: