పాకిస్తాన్ భారత్ సరిహద్దుllo రోజురోజుకు ఉద్రిక్త పరిస్థితులు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గడం లేదు. మొన్నటి వరకు భారత్-చైనా సరిహద్దు లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం అక్కడ కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినప్పటికీ.. పాకిస్తాన్ భారత సరిహద్దుల్లో మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల పాకిస్థాన్ ఏకంగా భారత సైన్యంపై కాల్పులకు  తెగబడింది.  ఈ కాల్పుల్లో నలుగురు భారత సైనికులు వీరమరణం పొందటం తో దీన్ని ఎంతో సీరియస్గా తీసుకున్న భారత ఆర్మీ ఎడతెరిపిలేకుండా ప్రస్తుతం పాకిస్తాన్ పై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.



 అంతేకాకుండా మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుతం సరిహద్దుల్లో ఏకంగా  మిస్సైల్స్ కూడా ఉపయోగిస్తోంది భారత్. దీంతో ఒక రకంగా పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధమే జరుగుతుంది అని చెప్పాలి. సరిహద్దుల్లో పాకిస్తాన్ ఏమాత్రం తోక జాడింపు  చర్యలకు పాల్పడిన పాకిస్తాన్ కోలుకోని విధంగా భారత్  దెబ్బ కొడుకు వస్తుంది అనే విషయం తెలిసిందే . ఇటీవలే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కి పాకిస్తాన్ ఒక డ్రోన్ పంపింది. ఈ డ్రోన్ ని అటు భారత నిఘా వ్యవస్థ గుర్తించడంతో అటు నుంచి అటే వెళ్ళిపోయింది డ్రోన్.



 దీంతో వెంటనే స్పందించిన భారత ఆర్మీ ఎంతో దీటుగా బదులిచ్చింది. పాకిస్తాన్ పై  మరోసారి దాడికి పాల్పడింది. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ ఎన్నో యుద్ధ ట్యాంకులను సరిహద్దుల్లోకి మోహరించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్యాంకులను ధ్వంసం చేసే విధంగా.. ఇటీవలే భారత ఆర్మీ మరోసారి మిసైల్స్ వాడింది. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్ వాడి ప్రస్తుతం పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసింది . దీంతో సరిహద్దుల్లో  పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారిపోయాయి. అయితే ఒక రకంగా సరిహద్దుల్లో యుద్ధం జరుగుతున్నప్పటికీ ఈ విషయాన్ని బయటకు చెబితే పాకిస్తాన్ ప్రజల నుంచి ఆర్మీ నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది కాబట్టి.. ఇమ్రాన్ ఖాన్ సైలెంట్ గానే ఉంటున్నారు అని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: