2019 ఎన్నికల ఫలితాలు ఏపీ చరిత్రలో నిలిచిపోయేవి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడు లేని విధంగా జగన్ సారథ్యంలోని వైసీపీ 175 సీట్లకు 151 సీట్లు గెలిచి చరిత్ర సృష్టించింది. అటు టీడీపీ కేవలం 23 సీట్లు గెలుచుకుని ప్రతిపక్షానికి పరిమితమైంది. జనసేన ఒకటి గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే జగన్ గెలుపు కేవలం ఎన్నికల సమయంలో ఒక్క ఛాన్స్ అంటూ అడగడం వల్లే వచ్చిందని టీడీపీ నేతలు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు.

తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సైతం జగన్ ఎన్నికల్లో 400కు పైనే హామీలు ఇచ్చి ప్రజలని మోసం చేశారని మాట్లాడుతున్నారు. చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత లేకపోయినా.. ఒక్క అవకాశం ఇచ్చి చూద్దామనే లాటరీలో జగన్ గెలిచారన్నారు. ఏనుగుల గుంపు గ్రామాలపై పడినట్లు.. వైసీపీ నేతలు అహంకారంతో ప్రజల్ని విచ్చలవిడిగా దోచుకుంటున్నారని, రాష్ట్రంలో 34కి పైగా పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని ఫైర్ అవుతున్నారు.

అయితే దీపక్ రెడ్డి చెప్పినట్లు జరిగిందా? అంటే అసలు లేదనే సమాధానం వస్తుంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబుపై ఎంత వ్యతిరేకిత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక తన తండ్రి వైఎస్సార్ సైతం అమలు చేయని విధంగా సరికొత్త పథకాలని అందిస్తున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలోని 90 శాతం వరకు హామీలు అమలు చేశారు.

ఇక టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని పథకాలని రద్దు చేసిన మాట వాస్తవమే. ఎందుకంటే ఆ పథకాల్లో ఉన్న లోటుపాట్లని సరిచేసి, వాటి ప్లేస్‌లో ప్రజలకు సరికొత్త పథకాలు అందించారు. ఆ విషయం ప్రజలకు కూడా బాగా తెలుసు. అసలు చెప్పాలంటే బాబు ప్రభుత్వం అందించిన పథకాల కంటే ఎక్కువగానే జగన్ పథకాలు ఇస్తున్నారు. అందుకే ఇప్పటికీ ప్రజల మద్ధతు వైసీపీకే ఉంది. అలాంటప్పుడు జగన్ మీద ఇలాంటి విమర్శలు చేస్తే పెద్ద ఉపయోగం ఉండదని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: