ఇటీవల తెలుగుదేశం పార్టీలో పదవుల పంపకాలు జరిగిన విషయం తెలిసిందే. అధికార పార్టీకి ధీటుగా ఉండేందుకు చంద్రబాబు, పార్టీలో కీలక పదవులు భర్తీ చేశారు. రాష్ట్ర అధ్యక్షులతో పాటు చాలా పదవులని భర్తీ చేశారు. అయితే టీడీపీలో కీలకంగా ఉన్న ఓ పదవిని మాత్రం భర్తీ చేయలేదు. యువతని ఆకర్షించే తెలుగు యువత అధ్యక్ష పదవిని ఎవరికి కట్టబెట్టలేదు. తెలంగాణ తెలుగు యువత అధ్యక్షుడుగా పొగాకు జయరాం ఉంటే, ఏపీకి అధ్యక్షుడుగా ఎవరు లేరు.

గతంలో ఈ పదవిలో దేవినేని అవినాష్ ఉండేవారు. అవినాష్ ఉన్నప్పుడు యువత ఫాలోయింగ్ టీడీపీకి గట్టిగానే పెరిగింది.  అవినాష్ బాగానే కష్టపడి పార్టీ కోసం పనిచేశారు. కానీ 2019 ఎన్నికల తర్వాత అవినాష్ టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు. దీంతో తెలుగు యువత పదవి మాత్రం అలాగే ఖాళీగా ఉండిపోయింది. ఇంతవరకు ఆ పదవిని వేరే వాళ్ళకు ఇవ్వలేదు.

ఈ పదవి రామ్మోహన్ నాయుడుకు గానీ, పరిటాల శ్రీరామ్‌కు గానీ ఇవ్వొచ్చని ప్రచారం జరిగింది. అయితే ఈ ఇద్దరికీ పార్టీలో కీలక పదవులు ఇచ్చారు. రామ్మోహన్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వగా, రాష్ట్ర కమిటీలో పరిటాల శ్రీరామ్‌కు చోటు దక్కింది. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా పరిటాల శ్రీరామ్ నియమితులయ్యారు. మరి దీని బట్టి చూసుకుంటే వీరికి తెలుగు యువత దక్కడం కష్టమనే చెప్పొచ్చు.

అయితే తెలుగు యువత నాదెండ్ల బ్రహ్మంకు దక్కే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది. బ్రహ్మంని టి‌ఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడుగా తొలగించి వేరే వాళ్ళకు ఇచ్చారు. దీంతో బ్రహ్మాంకు తెలుగు యువత దక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక ఇప్పుడు చంద్రబాబు, ఎప్పుడు ప్రకటిస్తారని పార్టీలోని యువత ఎదురుచూస్తుంది. అయితే పదవి ఎవరికి ఇవ్వకుండా నారా లోకేష్‌కు అప్పగించే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. మరి చూడాలి యువతని ఆకర్షించే ఈ పదవిని ఎవరికి అప్పగిస్తారో?

మరింత సమాచారం తెలుసుకోండి: