నేటి సమాజంలో సోషల్ మీడియా గురించి తెలియని వారంటూ ఎవరు లేరు. చాల మంది సోషల్ మీడియా ద్వారా అనేక దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా కోల్ కత్తాలో ఇలాంటి ఘటననే చోటు చేసుకుంది. వాళ్లిద్దరికీ సోషల్ మీడియాలో పరిచయమైంది. ఇద్దరూ భాగానే మాట్లాడుకున్నారు. ఇద్దరికీ చనువు ఏర్పడింది. ఆమె ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా.. అతడిది డిగ్రీ అయిపోయింది. ఖాళీగానే ఉంటున్నాడు. దీంతో సోషల్ మీడియాలో అమ్మాయిలకు ఏరా వేయడం మొదలుపెట్టాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గోవిందపూర్ కు చెందిన 16 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. కొద్దిరోజుల క్రితం ఆమెకు సోషల్ మీడియాలో పరిచయమైన ఆ వ్యక్తి ఆమెతో ప్రేమగా మాట్లాడాడు. ఇక అతను మంచివాడినని నమ్మించాడు. చివరికి కొద్ది రోజుల తర్వాత తనకు అర్జెంటుగా అవసరం ఉందని చెప్పి ఆమె దగ్గర రూ. 4 వేలు అప్పుగా తీసుకున్నాడు. వాటిని వెంటనే తీరుస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఆమె ఎంత అడిగినా డబ్బులు ఇవ్వలేదు. ఆ బాలిక అతడిని డబ్బులు కావాలని గట్టిగా అడిగింది. డబ్బులివ్వకుంటే ఈ విషయం ఇంట్లో చెబుతానని అతడిని బెదిరించింది.

దీంతో అతను ఆమెకు భయపడినట్లు నటించాడు. ఆమెను ఇంటికి రమ్మని పిలిచాడు. ఆమెకు డబ్బులిస్తానని నమ్మించాడు. అది నమ్మి ఆ బాలిక.. నిందితుడి ఇంటికెళ్లింది. ఆ సమయంలో అతని ఇంట్లో ఎవరూ లేరు. ఇదే అదునుగా భావించిన నిందితుడు.. బాధితురాలిని రేప్ చేశాడు. ఆమె ఎంత వదిలించుకున్నా.. విడవకుండా.. అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అంతేగాక ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే.. చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని నంటూగా గుర్తించారు. అతడిపై గతంలోనూ వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కేసులు నమోదైనట్టు తెలుస్తున్నది. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: