టెక్నాలజీ మారుతున్న కొద్దీ మనుషులు కొత్తకొత్త ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కొన్ని వ్యాధుల గురించి తెలుసుకున్నప్పటికీ మరికొన్ని వ్యాధుల గురించి అంతుచిక్కడం లేదు. అంతేకాక కొన్ని వ్యాధుల గురించి వింటుంటే ఇలాంటి వ్యాధులు కూడా ఉంటాయా అనేలా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మురౌనా ప్రాంతానికి చెందిన అశీష్ అనే యువకుని వయస్సు 16 సంవత్సరాలు. ఈ యువకుడు సంవత్సరంన్నర నుంచి టాయిలెట్ కు వెళ్లలేదు. అయితే సాధారణంగా ఇలాంటి విచిత్రమైన సమస్య ఉంటే ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.

కానీ విచిత్రం ఏమిటంటే ఈ యువకుడిని ఇతర ఆరోగ్య సమస్యలు సైతం వేధించలేదు. అయితే ప్రస్తుతం ఎటువంటి సమస్య లేకపోయినా భవిష్యత్తులో ఏదైనా సమస్య తలెత్తవచ్చని బాలుడి తల్లిదండ్రులు, బాలుడు కంగారు పడుతున్నారు. అయితే బాలుడు ప్రతిరోజూ ఆహారంగా 18 నుంచి 20 రొట్టెలు తీసుకుంటున్నాడని తల్లిదండ్రులు వెల్లడించారు. కానీ ఎంత ఆహారం తీసుంటున్నా అతను టాయిలెట్ కు వెళ్లపోవడంతో బాలుడికి ఏదో వింత వ్యాధి సోకి ఉండవచ్చని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డాడు.

తల్లిదండ్రులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతడికి సమస్య గురించి చెప్పడంతో వైద్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక  శాస్త్రవేత్తలు , వైద్యులు సైతం గతంలో తాము ఇలాంటి విచిత్రమైన కేసును ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. పరీక్షలు చేసినా అతనికి ఉన్న వ్యాధికి గుర్తించలేకపోయామని చెబుతున్నారు. చాలామంది వైద్యులు ఇప్పటికే బాలుడిని పరీక్షించి సమస్య ఏమిటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఎంతోమంది వైద్యుల చుట్టూ తిప్పుతున్నా వైద్యులు అతని సమస్యకు పరిష్కారం చూపించలేకపోయారు.

అయితే ఈ వింత వ్యాధికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బాలుడు అశీష్ తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ.. ఈ వింత వ్యాధి వల్ల తమ కొడుకు ప్రాణాలకు ప్రమాదం ఉందని భయంగా ఉందని చెబుతున్నారు. భవిష్యత్తులోనైనా బాలుడి సమస్యకు పరిష్కారం లభిస్తుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: