విశాఖ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజకీయ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా తయారైందనే సెటైర్లు వినిపిస్తున్నాయి.. అసలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మంచి పట్టున్న నాయకుడిగానే కాకుండా, బలమైన సామాజిక వర్గం అండదండలు ఆయనకు ఉన్నాయి. అందుకే ఇప్పటి వరకు రాజకీయంగా ఎదురే లేకుండా చేసుకుంటూ వచ్చారు. తెలుగుదేశం పార్టీలో మంచి ప్రాధాన్యం ఉన్న సమయంలోనే చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో చేరి, ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు పొత్తులో భాగంగా , గంటా కు మంత్రి పదవి వరించింది. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో ను ఆయన మరోసారి మంత్రి అయ్యరు. 


ఇక ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడ కూడా మంత్రిగానే పనిచేసి తన ప్రాధాన్యమేమిటో చాటి చెప్పుకున్నారు. అయితే 2019 ఎన్నికలకు ముందుగానే తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని గ్రహించిన గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించి విఫలమయ్యారు. దీనికి కారణం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. ఆయనే గంట చేరికను వాయిదా వేస్తూ వచ్చారు. అనుకున్నట్టుగానే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గంటా ఎన్నో రకాలుగా ప్రయత్నించినా ఎప్పటికప్పుడు ఏదో ఒక అవాంతరం వచ్చి పడుతూనే ఉంది. గంటా ఎలాగూ పార్టీ మారిపోతారనే ఉద్దేశంతో టిడిపి అధినేత చంద్రబాబు సైతం ఆయనను పూర్తిగా పక్కన పెట్టారు. ఇటీవల ప్రకటించిన పార్టీ కమిటీలను అందరికీ చోటు కల్పించారు కానీ,  గంటాను మాత్రం పట్టించుకోలేదు.



 వైసీపీలో లో చేరేందుకు  అక్కడ పరిస్థితులు అనుకూలించక పోవడం , అదే సమయంలో తన ఆస్తులకు సంబంధించి అవి అక్రమము అంటూ అధికారులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడం,  తన ప్రధాన అనుచరులు ఆస్తుల పైన పెట్టడం దృష్టి పెట్టడం వంటి వ్యవహారాలు ఎన్నో చోటు చేసుకుంటూ ఉండడంతో,  ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడేందుకు రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకునేందుకు గంటా సిద్ధమైనట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: