తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నికలు. ఇపుడు ఏపీలో  రాజకీయ వేడిని రగిలించే ఎన్నికలు ఇవే. జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. జగన్ సంక్షేమ కార్యక్రమాలు, పాలన మీద ప్రజలు  తొలి తీర్పు ఇచ్చేది ఇక్కడే. తిరుపతి లో జనాభిప్రాయం బయటపడితే అది మెల్లగా ఏపీ అంతటా పాకుతుంది. అలా జగన్ మీద వ్యతిరేకత ఉందని రుజువు చేయాలని టీడీపీ సహా విపక్షాల ఆరాటం.

కానీ తిరుపతిలో వైసీపీ గెలుపుని ఆపడం అంత ఈజీ కాదు, ఎందుకంటే గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన బల్లి దుర్గాప్రసాద్ కి టీడీపీ అభ్యర్ధిని పనబాక లక్ష్మి మీద 2 లక్షల 28 వేల ఓట్లు లభించాయి. ఇక మొత్తం 15 లక్షల దాకా ఓట్లు పోల్ అయితే అందుకో సగం దాకా అంటే ఏడున్నరల లక్షల వరకూ వైసీపీ సొంతం చేస్తుంది. ఈ పరిణామంతోనే బ్రహ్మాండమైన  మెజారిటీ వైసీపీకి దక్కింది.

ఈసారి వైసీపీ తరఫున ఎవరు పోటీ చేసినా పది లక్షల ఓట్లు వైసీపీకి రావాలని జగన్ గట్టి టార్గెట్లు పెట్టారని టాక్. మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లలోనూ వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతే కాదు, ప్రభుత్వం ప్రతీ సామాజికవర్గాన్ని కలుపుకుని అనేక సంక్షేమ పధకాలు అమలు చేసింది కాబట్టి అన్ని వర్గాలు వైసీపీకి ఓటేసేలా చూడాలని జగన్ ఆర్డర్ పాస్ చేశారట.

ఇక తిరుపతి ఉప ఎన్నిక ఫలితం రాష్ట్రమే కాదు,దేశం కూడా ఆశ్చర్యపోయేలా ఉండాలని కూడా జగన్ భావిస్తున్నారుట. ఇక విపక్షాలకు డిపాజిట్లు కూడా రాకూడదు అని జగన్ పార్టీ నాయకులను ఆదేశించారుట. మొత్తానికి చూస్తే జగన్ తిరుపతి ఉప ఎన్నికను ఎంత సీరియస్ గా తీసుకుంటున్నాడో అర్ధమవుతోది కదా. ఇక ఈ ఉప ఎన్నిక మీద మరింత ఇంటెరెస్ట్ ఇపుడు పెరిగిపోతోంది అందరికీ.

మరింత సమాచారం తెలుసుకోండి: