కాంగ్రెస్ పార్టీ నుంచి విజయశాంతి భారతీయ జనతా పార్టీలో కి వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఏంటి అనేది కూడా అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి ఆ పార్టీలోకి వెళ్లడంతో ఇప్పుడు అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏంటి అని దానిపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ కాంగ్రెస్ లో చాలా వరకు కూడా బలమైన నేతలు అంటూ ఎవరూ లేరు. తెలంగాణ కాంగ్రెస్ బలపడక పోవడానికి ప్రధాన కారణం అదే. విజయశాంతి ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీ తరఫున తన బలమైన వాణిని వినిపించడానికి ఆమె పెద్దగా ఆసక్తి చూపించలేదు.

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కొంతమంది బయటకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఆమె ఇప్పటికే ఢిల్లీ పర్యటనకు వెళ్లి ఢిల్లీలో పార్టీ మారడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఆమె కొంత మంది నేతలను కూడా బీజేపీ లోకి తీసుకుని వెళ్లే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బిజెపికి ప్రచారం చేసే అవకాశాలు ఉండవచ్చు అని కూడా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు కీలక నేతలను ఆమె బయటకు తీసుకొని వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది.

దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి స్పష్టత లేకపోయినా త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉండవచ్చు. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు మాత్రం విజయశాంతి కాస్త ఆసక్తికరంగా మారిపోయారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి దాదాపుగా అవకాశాలు ఎక్కువగా సృష్టించుకునే ప్రయత్నం ఆ పార్టీ నేతలు చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు ఫలిస్తుందో భారతీయ జనతా పార్టీని ఎంత వరకు నిలబెడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: