గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసే అంశానికి సంబంధించి ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారా లేదా అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో ఆయన ప్రచారం చేసే అంశానికి సంబంధించి ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ని ప్రచారానికి వద్దు అని బీజేపీ నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ ప్రచారానికి టిఆర్ఎస్ పార్టీ కొన్ని కొన్ని అంశాలను ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో రెండు స్థానాల్లో పోటీ చేసి ఓటమి పాలైన నేపథ్యంలో ఆయా అంశాలను టార్గెట్గా చేసుకుని టిఆర్ఎస్ పార్టీ విమర్శలు చేసే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కి కొన్ని విషయాల్లో విషయపరిజ్ఞానం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆయన మీద విమర్శలు చేసే అవకాశాలు ఉంటాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన పార్టీ అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకోవడం కూడా టిఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసే అవకాశాలు ఉండవచ్చు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేయక పోవచ్చు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఈ విషయంలో ఎలాంటి ముందడుగు పడుతుంది ఏంటి అనేది చూడాలి. అయితే జనసేన పార్టీలో ఉన్న ఒకరిద్దరు కీలక నేతలు కూడా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి రెడీ గా లేరు. అయితే ప్రజల్లోకి వెళ్లడానికి మాత్రం జనసేన పార్టీ కార్యకర్తలు సిద్ధంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ వారికి దిశానిర్ధేశం చేస్తే బాగుంటుందని బిజెపి నేతలు భావిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: