జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో ఇప్పుడు అసలు ఢిల్లీలో ఆయన ఏ అంశాల మీద చర్చిస్తారు ఏంటి అనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఢిల్లీ పర్యటనకు పవన్ కళ్యాణ్ వెళ్తున్న నేపథ్యంలో కొన్ని కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉండవచ్చు అనే భావన చాలా మందిలో వ్యక్తమౌతుంది. రాజకీయంగా ఇప్పుడు జనసేన పార్టీ దూకుడు పెంచింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల మంగళగిరిలో పార్టీ సమావేశాలు నిర్వహించారు.

 ఈ సందర్భంగా అమరావతి రైతులతో కూడా ఆయన సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలను తెలుసుకోవడమే కాకుండా అమరావతి నుంచి రాజధాని ఎక్కడికి వెళ్లే ప్రసక్తే లేదని బీజేపీ అధిష్టానం తనకు అదే విషయం స్పష్టంగా చెప్పిందని కాబట్టి అమరావతి ప్రాంత రైతులు అసలు కంగారు పడవద్దు అని పవన్ కళ్యాణ్ వారికి సూచనలు చేశారు. అనవసరంగా మీరు కంగారు పడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు అని ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో అసలు ఆసక్తిగా ఉంది.

అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేసే అవకాశాలు ఉండవచ్చు అని కూడా భావిస్తున్నారు. రాష్ట్రంలో గత మూడు నెలల నుంచి జరుగుతున్న కొన్ని పరిణామాల మీద ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళడానికి రెడీ అయినట్లు గా సమాచారం. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కూడా ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది. అంతేకాకుండా తిరుపతి ఉప ఎన్నికల మీద కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మీద కూడా పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: