గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ అగ్రనాయకత్వం ప్రచారం చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే బిజెపిలో కీలక నేతలు చాలామంది హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ముందుకు వస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే మాత్రం తెలంగాణలో ఆ పార్టీకి ఇబ్బందులు అనేవి ఉండకపోవచ్చు. టిఆర్ఎస్ పార్టీ క్రమంగా బలహీనపడి అవకాశాలు కూడా ఉంటాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతే మాత్రం ప్రజల్లో ఆ పార్టీ మీద అభిప్రాయం కూడా మారే అవకాశం ఉంటుంది అనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది అనే భావన వ్యక్తమవుతోంది. త్వరలోనే దీనికి సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రచారం చేయడానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అదే విధంగా కేంద్ర హోంశాఖ మంత్రి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. దీనికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా బీజేపీకి చెందిన కొంతమంది కీలక ఎంపీలు కూడా ప్రచారం చేసే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు.

అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నిధులకు సంబంధించి మరో కేంద్ర మంత్రి కూడా ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు, త్వరలోనే ఆయన కూడా ప్రచారానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని సమాచారం. నితిన్ గడ్కరీ విషయంలో సీఎం కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటికి సమాధానం చెప్పడానికి ఆయన హైదరాబాదులో పర్యటన చేసే అవకాశాలు కూడా ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు మాత్రం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బిజెపి నేతల ప్రచారం మీదనే అందరి దృష్టి ఉంది. మరి వాళ్ళు ఎంత ప్రచారం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: