ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్ని రోజుల నుంచి పోలవరం విషయం మరోసారి తెరమీదికి వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే.. ప్రతిపక్ష టిడిపి పార్టీ తో పాటు సిపిఐ పార్టీ కూడా జగన్ సర్కార్ పై పోలవరం ప్రాజెక్టు విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ సర్కార్ అవకతవకలకు పాల్పడుతున్న అంటూ ఆరోపిస్తూ విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తును తగ్గిస్తూ జగన్ సర్కార్ నిర్మిస్తుంది అంటూ అటు ప్రతిపక్ష టీడీపీ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే పోలవరం విషయంలో జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు సిపిఐ రామకృష్ణ.



 ఇక ఇటీవలే మరోసారి మీడియా సమావేశం నిర్వహించిన సిపిఐ రామకృష్ణ జగన్ సర్కార్ ను విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగనా  లేక  గౌతమ్ సావంగా  అంటూ ప్రశ్నించారు సిపిఐ రామకృష్ణ. తాము పోలవరం సందర్శించడానికి వెళితే పోలీసులు అడ్డుకున్నారని.. అక్కడ ఇంజనీర్లకు లేని బాధ పోలీసులకు ఎందుకు అంటూ ప్రశ్నించారు రామకృష్ణ. రాష్ట్రంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ రాజ్యం కొనసాగుతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఐ రామకృష్ణ... ఏకంగా సీఎం లాగా వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు.



అన్ని పార్టీలతో కలిసి పోలవరం విషయంలో పోరాటానికి సిద్ధం అవుతామని తెలిపిన సిపిఐ రామకృష్ణ ఈ నెల 30వ తేదీన తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని అంటూ సిపిఐ రామకృష్ణ వ్యాఖ్యానించారు. కాగా సిపిఐ రామకృష్ణ జగన్ సర్కార్ పై విమర్శలు చేయడంపై స్పందించిన ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు చెప్పింది తు.చ తప్పకుండా సిపిఐ రామకృష్ణ చేస్తున్నారని చంద్రబాబు అజెండా ని సిపిఐ రామకృష్ణ ఫాలో అవుతున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు. పోలవరం పై రాద్ధాంతం చేయడానికి సందర్శనకు వెళ్లారు అంటూ విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: