కరోనా  వైరస్ పుణ్యమా అని దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా దేశ వ్యాప్తంగా రైలు సర్వీసులన్ని  నిలిచిపోయాయి అన్న విషయం తెలిసిందే. దేశాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని లాక్ డౌన్  అమలు చేయడంతో... రైలు సర్వీసులతో పాటు అన్ని రకాల సర్వీసులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా ప్రస్తుతం భారత దేశంలో ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించే రైలు సర్వీసులు ద్వారానే కావడంతో రైలు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఆ తర్వాత అన్లాక్ మార్గదర్శకాలు లో భాగంగా పూర్తిస్థాయిలో రైలు సర్వీసులు ప్రారంభించలేదు కానీ ప్రత్యేకంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆయా జోన్ లలో ప్రత్యేక రైలు సర్వీసులను ప్రారంభిస్తూ వస్తుంది భారత రైల్వే శాఖ.



 ప్రస్తుతం దాదాపుగా ప్రయాణికులకు సరిపడే రైల్వే సర్వీసులు అందుబాటులో ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే డిసెంబరు 1 నుంచి రైల్వే సర్వీసుల నిలిచిపోనున్నాయి... కరోనా వైరస్ కారణంగా మరోసారి కేంద్ర ప్రభుత్వం రైలు సర్వీసులు అన్నింటిని నిలిపివేసేందుకు నిర్ణయించింది. ప్రయాణికులందరూ దీనిని తప్పకుండా గమనించాలి. అయితే ఇది చూసి ప్రయాణికులందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇప్పటికే గతంలో నిలిచిపోయిన రైళ్లు సర్వీసులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే మళ్లీ రైలు సర్వీసులు నిలిచిపోవడమా  అని ఆందోళన చెందారు.



 కానీ అసలు విషయం ఏమిటి అన్నది మాత్రం పిఐబి  తేల్చేసింది. దేశవ్యాప్తంగా డిసెంబర్ 1 తరువాత రైళ్లన్నీ నిలిచిపోయాయి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త పూర్తిగా అవాస్తవం అంటూ పిఐబి తేల్చేసింది. రైల్వే ప్రయాణికుల ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ స్పష్టం చేసింది. రైలు సర్వీసులు నిలిపివేత పై కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు అంటూ స్పష్టం చేసింది. రైల్వే ప్రయాణికుల ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని దేశంలో రైల్వే ప్రయాణాలు యథావిధిగా కొనసాగుతాయి అంటూ స్పష్టం చేసింది పిఐబి.

మరింత సమాచారం తెలుసుకోండి: